
T20 World Cup: ఎవిన్ లూయిస్ ఆదుకున్నాడు..
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో.. దక్షిణాఫ్రికా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వెస్టిండీస్ మోస్తరు పరుగులకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ముందు 144 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ ఎవిన్ లూయిస్ (56) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో డ్వేయిన్ ప్రిటోరియస్ మూడు, కేశవ్ మహరాజ్ రెండు, కగిసో రబాడ, అన్రిచ్ నోర్జే తలో వికెట్ తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన విండీస్ తొలి మూడు ఓవర్లలో ఆరు పరుగులే చేసింది. నాలుగో ఓవర్ నుంచి గేర్ మార్చిన ఎవిన్ లూయిస్ ఫోర్లు సిక్సర్లతో అలరించాడు. మరో ఓపెనర్ లెండిల్ సిమ్మన్స్ (16) నెమ్మదిగా ఆడుతూ అతడికి సహకరించాడు. అర్ధ శతకం పూర్తి చేసుకున్న తర్వాత లూయిస్ కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ (12) దూకుడుగా ఆడే క్రమంలో డేవిడ్ మిల్లర్‌కి చిక్కి క్రీజు వీడాడు. కగిసో రబాడ వేసిన 14వ ఓవర్లో సిమ్మన్స్ బౌల్డై మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. క్రిస్ గేల్ (12), షిమ్రోన్ హెట్‌మైర్ (1), ఆండ్రూ రస్సెల్ (5), హేడెన్ వాల్ష్ (0) విఫలమయ్యారు. ఆఖర్లో వచ్చిన పొలార్డ్ (26) పరుగులు చేశాడు. డ్వేన్ బ్రావో (8), అకీల్ హోసీన్ (0) నాటౌట్‌గా నిలిచారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.