
SA vs IND : మూడో వన్డేలోనైనా భారత్‌కు విజయం దక్కేనా? టాస్ గెలిచిన టీమ్‌ఇండియా
కేప్‌టౌన్: మరికాసేపట్లో దక్షిణాఫ్రికా, భారత్ మధ్య మూడో వన్డే ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు కేప్‌టౌన్ వేదికగా నిలిచింది. టాస్ గెలిచిన టీమ్‌ఇండియా ప్రత్యర్థి జట్టుని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. తొలి రెండు వన్డేల్లో గెలిచి మూడు వన్డేల సిరీస్‌ని 2-0 తేడాతో కైవసం చేసుకున్న సౌతాఫ్రికా ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్‌ని అందుకోవాలని అతిథ్యజట్టు తహతహలాడుతోంది. మరోవైపు, మిడిలార్డర్ విఫలమవడం తొలి వన్డేలో భారత్‌ని దెబ్బతీసింది. రెండో వన్డేలో కెప్టెన్ కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ మెరవడంతో భారీ స్కోరు సాధించినా.. బౌలర్లు తేలిపోవడంతో మ్యాచ్‌ని చేజార్చుకుంది. ఈ లోపాలను సరిదిద్దుకుని విజయంతో విజయంతో పర్యటన ముగిస్తుందేమో చూడాలి.
భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, జయంత్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, దీపక్ చాహర్, బుమ్రా, చాహల్
దక్షిణాఫ్రికా జట్టు: మలన్, డికాక్ (వికెట్ కీపర్), తెంబా బవుమా (కెప్టెన్), మార్‌క్రమ్, డసెన్, డేవిడ్ మిల్లర్, పెహులుక్వాయో, కేశవ్ మహారాజ్, ప్రిటోరిస్, ఎంగిడి, మగలా