INDW vs SAW: ముక్కోణపు సిరీస్ ఫైనల్‌లో భారత్ ఓటమి..
మహిళల ప్రపంచకప్ ముంగిట దక్షిణాఫ్రికాతో గురువారం జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్ ఫైనల్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
ఈస్ట్ లండన్: మహిళల ప్రపంచకప్ ముంగిట దక్షిణాఫ్రికాతో గురువారం జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్ ఫైనల్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. 110 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా ఐదు వికెట్లు నష్టపోయి 18 ఓవర్లలోనే ఛేదించింది. ట్రయాన్ (51; 31 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకంతో మెరిసింది. భారత బౌలర్లలో స్నేహ రానా రెండు వికెట్లు పడగొట్టగా.. దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, రేణుక సింగ్ తలో వికెట్ తీశారు.
తొలుత భారత బ్యాటర్లలో ఓపెనర్లు స్మృతి మంధాన (0), జెమీమా రోడ్రిగ్స్ (11) నిరాశపర్చగా.. హర్లీన్ డియోల్ (46) రాణించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (21), దీప్తి శర్మ (16) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా రెండు వికెట్లు పడగొట్టగా.. ఆయబొంగ ఖాకా, సునే లూస్ ఒక్కో వికెట్ తీశారు. ఈ నెల 10 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభంకానుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
వింత ఘటన.. ఉల్లి కోసేందుకు వెళితే కళ్లలోంచి కీటకాల ధార
-
Ap-top-news News
Andhra News: ఈ వృద్ధుడు.. మృత్యుంజయుడు
-
Ap-top-news News
Vande Bharat Express: సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్ షెడ్యూల్ ఇదే..
-
Crime News
Suresh Raina: సురేశ్ రైనా అత్తామామల హత్యకేసు నిందితుడి ఎన్కౌంటర్
-
Ts-top-news News
ఉదయం ప్రజాప్రతినిధి.. మధ్యాహ్నం కూలీ
-
Sports News
ధోని కెప్టెన్సీ పేలవం: టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్