WT20: ఇంగ్లాండ్‌పై దక్షిణాఫ్రికా విజయం.. ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో ఢీ

మహిళ టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు దక్షిణాఫ్రికా దూసుకెళ్లింది. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌-2 మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Published : 24 Feb 2023 22:57 IST

కేప్‌టౌన్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు దక్షిణాఫ్రికా దూసుకెళ్లింది. కేప్‌టౌన్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌-2 పోరులో 6 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.  మహిళల టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. ఆదివారం జరగనున్న ప్రతిష్ఠాత్మక ఫైనల్‌ పోరులో ఆస్ట్రేలియాను ఢీ కొట్టనుంది.

తొలుత టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. తజ్‌మిన్‌ బ్రిట్స్‌ (68), వాల్వార్డ్‌ (53) పరుగులు చేశారు. అనంతరం 165 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇంగ్లాండ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు ఓటమిపాలైంది.  ఇంగ్లాండ్‌ జట్టులో డేనియల్‌ వ్యాట్‌ (34), నాట్‌ స్కీవర్‌ బ్రంట్‌ (40), సోఫియా డంక్లీ (28), హీదర్‌నైట్‌ (31) మినహా మిగతా వారెవ్వరూ చెప్పుకోదగ్గ స్కోరు సాధించలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో అయాబొంగాఖాకా 4, షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ 3, నడైన్‌ దే క్లెర్క్‌ ఒక వికెట్‌ పడగొట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని