WTC Final: 90% వర్షం కురుస్తుందని అంచనా!

అరంగేట్రం ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు వరుణుడు అడ్డుతగిలేలా కనిపిస్తున్నాడు. మొదటి రోజైన శుక్రవారం సౌథాంప్టన్‌లో వర్షసూచన కనిపిస్తోంది. మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో మ్యాచ్‌ సవ్యంగా సాగుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది....

Published : 18 Jun 2021 12:11 IST

(సౌథాంప్టన్‌ పాత చిత్రం)

ఇంటర్నెట్‌ డెస్క్‌: అరంగేట్రం ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు వరుణుడు అడ్డుతగిలేలా కనిపిస్తున్నాడు. మొదటి రోజైన శుక్రవారం సౌథాంప్టన్‌లో వర్షసూచన కనిపిస్తోంది. మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో మ్యాచ్‌ సవ్యంగా సాగుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవేళ భారీ వర్షం కురవకపోయినా చిరుజల్లులు పదేపదే మ్యాచ్‌కు అంతరాయం కలిగించే అవకాశం ఉందని అక్కడి వర్గాలు అంటున్నాయి.

వివిధ వాతావరణ సమాచార వెబ్‌సైట్ల ప్రకారం సౌథాంప్టన్‌లో శుక్రవారం 91% వర్షం పడేందుకు ఆస్కారం ఉంది. మధ్యాహ్నం 95%, సాయంత్రం 47%, అర్ధరాత్రి 16% వర్షం కురుస్తుందని అవి పేర్కొంటున్నాయి. మ్యాచ్‌ జరిగే ఐదు రోజులు ‘వరుణుడు టెస్టు మ్యాచ్‌’ ఆడే అవకాశాలను కొట్టిపారేయడం లేదు.

‘శుక్రవారం మొత్తం ఆకాశంలో మబ్బులు కమ్ముకోవచ్చు. సుదీర్ఘ సమయం వర్షం కురిసే అవకాశం ఉంది. ఉదయం నుంచే ఉరుములు, మెరుపులతో వాన పడేందుకు ఆస్కారం ఉంది. శుక్రవారం ఉదయం 6 నుంచి శనివారం ఉదయం 6 వరకు ఉరుములతో కూడిన వర్షం పడనుంది. అందుకే పసుపు రంగు హెచ్చరికలు జారీ చేశాం’ అని బ్రిటన్‌ వాతావరణ శాఖ తెలిపింది.  ‘కొన్ని ప్రాంతాల్లో రోజంతా 40 మిల్లీ మీటర్ల వర్షం పడుతుందని అంచనా. సౌథాంప్టన్‌లో శుక్రవారం రాత్రికి వర్షం తెరపినివ్వొచ్చు. శనివారం వాతావరణం పొడిగా ఉండొచ్చు’ అని వెల్లడించింది. ఇప్పటికైతే (మధ్యాహ్న 12 గంటలకు) సౌథాంప్టన్‌లో వాతావరణం ఎలావుందో ఐసీసీ అధికారికంగా చెప్పలేదు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని