T20 WC 2024: ‘పిచ్‌’ టేస్ట్‌.. రోబో వాక్.. సూపర్‌ ఎండింగ్‌.. ఫన్ మూమెంట్స్‌!

దాదాపు పదిహేడేళ్ల తర్వాత భారత్‌ రెండోసారి టీ20 ప్రపంచ కప్‌లో విజేతగా నిలిచింది. బార్బడోస్‌ వేదికగా జరిగిన ఫైనల్‌లో సఫారీ జట్టును ఓడించింది.

Updated : 30 Jun 2024 15:01 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన టీమ్‌ఇండియా విశ్వవిజేతగా నిలిచింది. రెండోసారి పొట్టి కప్పును సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌తో రాహుల్‌ ద్రవిడ్‌ తన కోచింగ్‌ బాధ్యతల నుంచి రిలీవ్‌ అయ్యాడు. ఇక టీ20 కెరీర్‌కు కెప్టెన్ రోహిత్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గుడ్‌బై చెప్పేశారు. ఈ సందర్భంగా పలు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారిపోయాయి. అవేంటో ఓ లుక్కేద్దాం..

కుల్‌దీప్‌ చెప్పాడు.. రోహిత్ చేశాడు..

టీ20 ప్రపంచ కప్‌ను అందుకొనే సమయంలో రోహిత్ ‘రోబో’లా వచ్చాడు. డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ రిక్ ఫ్లెయిర్‌ స్టైల్‌లో ఇలా చేశాడు. రోహిత్‌ను ఇలా రమ్మని అంతకుముందు కుల్‌దీప్‌ యాదవ్‌ చెప్పడం గమనార్హం.


ఇంతకుమించి గొప్ప వీడ్కోలు ఉంటుందా?

ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌కు చివరి రోజు. జులై నుంచి కొత్త కోచ్ ఆధ్వర్యంలో టీమ్‌ఇండియా ఆటగాళ్లు సన్నద్ధం కావాల్సి ఉంటుంది. గత మూడేళ్ల నుంచి జట్టును సిద్ధం చేయడంలో ద్రవిడ్ తీవ్రంగా కృషి చేశాడు. వరల్డ్‌ కప్‌ గెలిచిన తర్వాత ఆటగాళ్లంతా అతడిని ఎత్తుకొని సంబరాలు చేసుకున్నారు.


రోహిత్-హార్దిక్‌ హత్తుకొని.. 

ప్రపంచ కప్‌ ముందు వరకు ముంబయి కెప్టెన్సీ విషయంలో రోహిత్, హార్దిక్‌ మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి. అదేం లేదని తమ చర్యలతో వీరిద్దరూ నిరూపించారు.  మ్యాచ్‌ అనంతరం హత్తుకొన్నారు. కన్నీళ్లు పెట్టుకున్న హార్దిక్‌ను రోహిత్ ఓదార్చాడు. 


సీనియర్‌ ఓపెనర్ల సంతోషం..

టీ20 ప్రపంచ కప్‌లో ఓపెనర్లుగా విరాట్, రోహిత్ ఆడారు. కోహ్లీ విఫలమైనా సరే జోడీని మాత్రం మార్చలేదు. చాలా మంది విమర్శలు చేశారు. కొత్త కుర్రాడు యశస్విని ఆడిస్తే బాగుండనే సలహాలు వచ్చాయి. చివరి మ్యాచ్‌ వరకూ వీరిద్దరే ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ఒకేసారి పొట్టి ఫార్మాట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించడం విశేషం.  


పిచ్‌పై మట్టిని రుచి చూసిన రోహిత్

బార్బడోస్‌ పిచ్‌.. భారత్‌కు రెండోసారి టీ20 ప్రపంచ కప్‌ను అందించిన మైదానం. ఆ ఆనందంతో రోహిత్ పిచ్‌పై ఉన్న మట్టిని టేస్ట్ చేస్తున్నట్లు వచ్చిన వీడియో వైరల్‌గా మారింది.  ఇది ‘విక్టరీ టేస్ట్‌’ అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని