S Sreeshanth : అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీశాంత్‌ వీడ్కోలు

టీమ్‌ఇండియా పేసర్‌ శ్రీశాంత్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అతడు ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు. 2013 ఐపీఎల్‌ సీజన్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు

Updated : 09 Mar 2022 22:11 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : టీమ్‌ఇండియా పేసర్‌ శ్రీశాంత్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అతడు ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు. 2013 ఐపీఎల్‌ సీజన్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన కేసులో దోషిగా తేలడంతో శ్రీశాంత్‌పై బీసీసీఐ ఏడేళ్లు నిషేధం విధించింది. 2020 సెప్టెంబరు నాటికి ఏడేళ్లు పూర్తయినా అతడికి భారత జట్టు తరఫున ఆడే అవకాశాలు రాలేదు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ వేలంలోనూ అతడిని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు.

‘తర్వాతి తరం క్రికెటర్ల కోసం.. నా క్రికెటింగ్‌ కెరీర్‌ని ఇంతటితో ముగించాలని నిర్ణయించుకున్నాను. ఇది నా సొంత నిర్ణయమే. ఈ కఠిన నిర్ణయంతో కాస్త బాధ కలిగినా.. క్రికెట్ నుంచి గౌరవప్రదంగా తప్పుకునేందుకు ఇదే సరైన సమయం అని భావిస్తున్నాను. భారత్‌ తరఫున ఆడిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. నా జీవితంలో ఈ రోజు చాలా కష్టమైనది. కానీ ఒక క్రికెటర్‌గా ఐసీసీ, బీసీసీఐ, కేరళ స్టేట్ క్రికెట్ అసోసియేషన్‌ ఇలా రకరకాల టోర్నీల్లో ప్రాతినిథ్యం వహించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులకు, సహచర ఆటగాళ్లకు, క్రికెట్‌ అభిమానులకు ధన్యవాదాలు’ అని శ్రీశాంత్ ట్వీట్ చేశాడు.

భారత జట్టు తరఫున శ్రీశాంత్‌ 27 టెస్టుల్లో 87 వికెట్లు, 53 వన్డేల్లో 75 వికెట్లు పడగొట్టాడు. అలాగే, 10 టీ20 మ్యాచుల్లో 7 వికెట్లు, ఐపీఎల్‌లో 40 మ్యాచుల్లో 44 వికెట్లు తీశాడు.







Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని