టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్‌

అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మరికాసేపట్లో రాజస్థాన్ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభంకానుంది. టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌

Updated : 02 May 2021 15:27 IST

 దిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మరికాసేపట్లో రాజస్థాన్ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభంకానుంది. టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ ఇరు జట్లు ప్రస్తుత ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాయి. ఇప్పటివరకు 6  మ్యాచులాడిన రాజస్థాన్..రెండు విజయాలను నమోదు చేసి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఆరు మ్యాచులు ఆడి కేవలం ఒకే విజయం సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఇకమీదట జరిగే ప్రతి మ్యాచ్‌లోనూ నెగ్గాల్సిందే. ఈ మ్యాచ్‌ నుంచి డేవిడ్ వార్నర్‌ స్థానంలో కేన్‌ విలియమ్సన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్ కెప్టెన్‌గా  కొనసాగుతాడని ఆ జట్టు యాజమాన్యం ప్రకటించిన విషయం తెలిసిందే. కెప్టెన్సీ మార్పుతోనైనా సన్‌రైజర్స్‌ విజయాల బాట పడుతుందేమో చూడాలి.

రాజస్థాన్ రాయల్స్‌: సంజూ శాంసన్(కెప్టెన్‌), జోస్‌ బట్లర్‌, యశస్వీ జైస్వాల్, అనుజ్‌ రావత్‌, డేవిడ్ మిల్లర్‌, రియాన్ పరాగ్, రాహుల్‌ తెవాతియా, క్రిస్ మోరిస్, కార్తీక్ త్యాగి, చేతన్‌ సకారియా, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), బెయిర్ స్టో, మనీశ్‌ పాండే, కేదార్ జాదవ్, విజయ్ శంకర్‌, అబ్దుల్ సమద్‌, మహ్మద్‌ నబీ, రషీద్‌ ఖాన్, భువనేశ్వర్‌ కుమార్, సందీప్‌ శర్మ, ఖలీల్ అహ్మద్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు