Asia Cup 2023: ఆసియా కప్‌ జట్టును ప్రకటించిన శ్రీలంక.. గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు దూరం

ఆగస్టు 30 నుంచి ప్రారంభంకానున్న ఆసియా కప్‌ (Asia Cup 2023) కోసం శ్రీలంక ఎట్టకేలకు తమ జట్టును ప్రకటించింది.

Published : 29 Aug 2023 21:43 IST

ఇంటర్నెట్ డెస్క్: రేపటి నుంచి (ఆగస్టు 30) ప్రారంభంకానున్న ఆసియా కప్‌ (Asia Cup 2023) కోసం శ్రీలంక తమ జట్టును ఎట్టకేలకు ప్రకటించింది. డాసున్ శనక నాయకత్వంలో 15 మందితో కూడిన జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. గాయాల కారణంగా నలుగురు కీలకమైన ఆటగాళ్లు ఈ టోర్నీకి దూరమయ్యారు. స్టార్‌ ఆల్‌రౌండర్‌ వానిందు హసరంగతోపాటు పేసర్లు దుష్మంత చమీరా, లాహిరు మధుశంక, లాహిరు కుమారలకు గాయాల వల్ల ఆసియా కప్ జట్టులోకి తీసుకోలేదు. శ్రీలంక ప్రీమియర్‌ లీగ్‌లో చమీర భుజానికి, హసరంగ తొడకు గాయాలయ్యాయి. అయితే, ఇదే టోర్నీలో కరోనా పాజిటివ్‌గా తేలిన బ్యాటర్‌ కుశాల్‌ పెరీరాకు చోటు దక్కింది. ప్రస్తుతం అతడు ఐసోలేషన్‌లో ఉన్నాడు. పూర్తిగా కోలుకోగానే జట్టులో చేరతాడని శ్రీలంక క్రికెట్ బోర్డు పేర్కొంది. అతడు రెండేళ్ల తర్వాత వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. హసరంగ స్థానంలో దుషన్ హేమంత తీసుకున్నారు. ఆసియా కప్‌లో శ్రీలంక తమ మొదటి మ్యాచ్‌ ఆగస్టు 31న బంగ్లాదేశ్‌తో ఆడనుంది.

ప్రయోగాలు ఊరకే చేయం.. వాటికీ కారణాలుంటాయ్‌.. రాహుల్ ద్రవిడ్

ఆసియా కప్‌ కోసం శ్రీలంక జట్టు: 

డాసున్ శనక (కెప్టెన్‌), పాతుమ్ నిశాంక, దిముత్ కరుణరత్నె, కుశాల్‌ పెరీరా, కుశాల్ మెండిస్ (వైస్‌ కెప్టెన్‌), చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, సదీర సమరవిక్రమ, మహీశ్‌ తీక్షణ, దునిత్ వెల్లలాగే, మతీశా పతిరణ, కాసున్ రజితా, దుషన్ హేమంత, బినుర ఫెర్నాండో, ప్రమోద్ మధుషన్‌.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని