Asia Cup 2022: ఉత్కంఠ పోరులో ఓడిన బంగ్లా.. సూపర్‌-4కు శ్రీలంక

ఆసియా కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో శ్రీలంక 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో శ్రీలంక సూపర్‌-4కు చేరుకోగా, బంగ్లా ఇంటి బాట పట్టింది.

Updated : 02 Sep 2022 00:47 IST

దుబాయి: ఆసియా కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో శ్రీలంక 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో శ్రీలంక సూపర్‌-4కు చేరుకోగా, బంగ్లా ఇంటి బాట పట్టింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అఫిఫ్‌ హొస్సేన్‌ (39), హసన్‌ మిరాజ్‌(38) రాణించారు. శ్రీలంక బౌలర్లలో హసరంగ, కరుణరత్నే తలో రెండు వికెట్లు తీశారు. 

అనంతరం 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 19.2 ఓవర్లలో విజయం సాధించింది. లంక విజయానికి చివరి రెండు ఓవర్లలో 25 పరుగులు అవసరం కాగా 19వ ఓవర్లలో ఒక వికెట్‌ పడడంతో పాటు ఏకంగా 17 పరుగులు వచ్చాయి. ఇక చివరి ఓవర్‌లో శ్రీలంక విజయానికి 8 పరుగులు అవసరం అయ్యాయి. చేతిలో రెండే వికెట్లు ఉండడంతో ఉత్కంఠ నెలకొంది. తొలి బంతికి ఒక పరుగు వచ్చింది. రెండో బంతికి ఫెర్నాండో ఫోర్‌ కొట్టాడు. మూడో బాల్‌ నోబాల్‌ వేయడంతో పాటు 2 పరుగులు రావడంతో లంక జట్టు గెలుపొందింది. శ్రీలంక జట్టులో కుశాల్‌ మెండిస్‌(60) అర్ధశతకంతో మెరవగా, దశున్‌ శనక(45) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇప్పటికే  ఇదే గ్రూప్‌లో ఉన్న అఫ్గానిస్థాన్‌ సూపర్‌-4కు చేరుకుంది. గ్రూప్‌-ఎ నుంచి భారత్‌ సూపర్‌-4కు చేరుకుంది. ఇక గ్రూప్‌ లెవల్‌లో పాకిస్థాన్‌-హాంకాంగ్‌ మధ్య చివరి మ్యాచ్‌ ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని