T20 World Cup: నెదర్లాండ్స్‌పై శ్రీలంక ఘనవిజయం

టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌-8కే చేరలేకపోయిన శ్రీలంక జట్టు.. గ్రూప్‌-డిలో నామమాత్రమై చివరి మ్యాచ్‌లో 83 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. సోమవారం టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ధాటిగా ఆడింది.

Published : 18 Jun 2024 02:52 IST

గ్రాస్‌ ఐలెట్‌: టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌-8కే చేరలేకపోయిన శ్రీలంక జట్టు.. గ్రూప్‌-డిలో నామమాత్రమై చివరి మ్యాచ్‌లో 83 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. సోమవారం టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ధాటిగా ఆడింది. కుశాల్‌ మెండిస్‌ (46; 29 బంతుల్లో 5×4), చరిత్‌ అసలంక (46; 21 బంతుల్లో 1×4, 5×6) చెలరేగడంతో 6 వికెట్లకు 201 పరుగులు చేసింది. ధనంజయ డిసిల్వా (34; 26 బంతుల్లో 3×4, 1×6), మాథ్యూస్‌ (30 నాటౌట్‌; 15 బంతుల్లో 1×4, 2×6), హసరంగ (20 నాటౌట్‌; 6 బంతుల్లో 1×4, 2×6) కూడా బ్యాట్‌ ఝళిపించారు. ఆఖరి నాలుగు ఓవర్లలో లంక ఏకంగా 67 పరుగులు రాబట్టింది. ఛేదనలో నెదర్లాండ్స్‌ తేలిపోయింది. తుషార (3/24), పతిరన (2/12), హసరంగ (2/25)ల ధాటికి 16.4 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌ లెవిట్‌ (31), కెప్టెన్‌ ఎడ్వర్డ్స్‌ (31) మాత్రమే రాణించారు. ఒకే ఒక్క విజయం సాధించిన లంక.. గ్రూప్‌-డిలో మూడో స్థానంతో టోర్నీని ముగించింది. ఈ గ్రూప్‌ నుంచి దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ సూపర్‌-8కు అర్హత సాధించాయి. నాలుగు మ్యాచ్‌ల్లో ఒకటి నెగ్గిన నెదర్లాండ్స్‌ గ్రూపులో నాలుగో స్థానంలో నిలిచింది. శ్రీలంక: 201/6 (కుశాల్‌ మెండిస్‌ 46, అసలంక 46, ధనంజయ డిసిల్వా 34, మాథ్యూస్‌ 30 నాటౌట్‌; వాన్‌బీక్‌ 2/45); నెదర్లాండ్స్‌: 118 (లెవిట్‌ 31, ఎడ్వర్డ్స్‌ 31, సిబ్రాండ్‌ 11; తుషార 3/24, పతిరన 2/12, హసరంగ 2/25).

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని