INDvsSL: లంక క్రికెటర్లు బయో బుడగకే

ఇంగ్లాండ్‌ పర్యటన ముగించుకొని శ్రీలంకకు తిరిగొస్తున్న ఆ జట్టు ఆటగాళ్లు మంగళవారం ఇళ్లకు వెళ్లకుండా బయోబుడగలోకే అడుగుపెడతారని ఆ బోర్డు అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు...

Published : 07 Jul 2021 01:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌ పర్యటన ముగించుకొని శ్రీలంకకు తిరిగొస్తున్న ఆ జట్టు ఆటగాళ్లు మంగళవారం ఇళ్లకు వెళ్లకుండా బయోబుడగలోకే అడుగుపెడతారని ఆ బోర్డు అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు. ఒక బుడగ నుంచి మరో బుడగలోకి ప్రవేశిస్తారని చెప్పారు. మరో వారంలో టీమ్‌ఇండియాతో పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడనున్న నేపథ్యంలో వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఆదివారం ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో ఆడిన శ్రీలంక ప్రస్తుతం ఆందోళనలో ఉంది. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఇంగ్లాండ్‌ జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు, నలుగురు సహాయక సిబ్బంది వైరస్‌ బారిన పడ్డారు.

‘శ్రీలంక జట్టు మంగళవారమే కొలంబో చేరుకుంటుంది. వారు ఇక్కడ దిగగానే ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు జరుపుతాము. తర్వాత నేరుగా మరో బుడగలోకి ప్రవేశిస్తారు. ఆదివారం ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ ముగిసిన తర్వాత మా ఆటగాళ్లు స్వదేశానికి తిరిగి ప్రయాణమయ్యే ముందు కూడా ఒకసారి పరీక్షలు చేశారు. వచ్చేవారమే టీమ్‌ఇండియాతో వన్డే సిరీస్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆటగాళ్లెవరూ తమ ఇళ్లకు వెళ్లడంలేదు. వాళ్లంతా ఒక బబుల్‌ నుంచి మరో బబుల్‌లోకి అడుగుపెడుతున్నారు. ఒకవేళ ఎవరైనా కరోనా బారిన పడితే  వైద్యం అందించేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు ఉంటాయి. ఆటగాళ్లని ఐసోలేషన్‌లో ఉంచడం, పాజిటివ్‌గా తేలిన వారికి సరైన వైద్య సహాయం అందించడం జరుగుతుంది’ అని అధికారి చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని