IND vs SL: ఉత్కంఠ పోరులో శ్రీలంక విజయం.. సిరీస్‌ సమం

కొలంబో వేదికగా భారత్‌తో జరిగిన రెండో టీ20లో శ్రీలంక నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. అయితే టీమ్‌ఇండియా నిర్దేశించిన 133 పరుగుల లక్ష్యాన్ని

Updated : 29 Jul 2021 00:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొలంబో వేదికగా భారత్‌తో జరిగిన రెండో టీ20లో శ్రీలంక నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. అయితే టీమ్‌ఇండియా నిర్దేశించిన 133 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి  శ్రీలంక చెమటోడ్చింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.  కెప్టెన్‌ ధావన్‌(40), కొత్త ఆటగాడు పడిక్కల్‌(29) మినహా మిగతా వారువిఫలమయ్యారు. దీంతో భారత్‌ శ్రీలంక ఎదుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. శ్రీలంక జట్టులో ధనంజయ 2 వికెట్లు తీశాడు.  

అనంతరం 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. జట్టు స్కోరు 12 పరుగులు ఉన్నప్పుడు ఓపెనర్‌ అవిష్క ఫెర్నాండో(11)ను భువీ వెనక్కి పంపాడు. దీంతో శ్రీలంక కష్టాల్లో పడింది. అయితే మరో ఓపెనర్‌ మినోద్‌ భానుక(36), సమర విక్రమతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ప్రమాదకరంగా మారుతున్న భానుకను కుల్‌దీప్‌ యాదవ్‌ పెవిలియన్‌కు చేర్చాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ధనుంజయ డిసిల్వ(40 నాటౌట్‌) చివరి వరకు క్రీజులో ఉండి లంక విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివర్లో మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా మారింది. లంక విజయానికి ఆఖరి ఓవర్‌లో 8 పరుగులు అవసరం కాగా.. డిసిల్వ సునాయసంగా లంకను విజయతీరాలకు చేర్చాడు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని