IND vs SL: శ్రీలంక లక్ష్యం 133
శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో భారత బ్యాట్స్‌మెన్ పెద్దగా రాణించలేకపోయారు.దీంతో ప్రత్యర్థి
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో భారత బ్యాట్స్‌మెన్ పెద్దగా రాణించలేకపోయారు. దీంతో ప్రత్యర్థి ముందు 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది టీమ్ఇండియా. తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన లంక జట్టు ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో రంగంలోకి దిగింది. దీంతో బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసరడంతో బోర్డును ముందుకు నడిపించడం భారత బ్యాట్స్‌మెన్‌కు కష్టతరంగా మారింది. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో పెద్ద భాగస్వామ్యాలు నెలకొల్పడంలో టీమిండియా విఫలమైంది. జట్టు సారథి శిఖర్ ధావన్ (40) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్దగా రాణించలేదు. అరంగేట్రం చేసిన రుతురాజ్ (21), పడిక్కల్ (29) ఫర్వాలేదనించగా.. సంజూ శాంసన్ (7) నిరాశపర్చాడు. లంక బౌలర్లలో అఖిల ధనంజయ రెండు, హసరంగ, శనక, చమీరా తలో వికెట్ పడగొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంపైర్‌గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్‌తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్‌లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్‌తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్‌తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్‌కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్‌లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్‌బాబు-రాజమౌళి మూవీ.. వైరల్‌గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు