T20 World Cup: అదరగొట్టిన అసలంక.. బంగ్లాపై శ్రీలంక విజయం

టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక శుభారంభం చేసింది. చరిత్‌ హసలంక (80; 49 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), రాజపక్స..

Updated : 24 Oct 2021 19:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక శుభారంభం చేసింది. చరిత్‌ అసలంక (80; 49 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), రాజపక్స (53; 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగి ఆడటంతో బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లా నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని లంక 18.5 ఓవర్లలోనే ఛేదించింది. లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంకకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. కుశాల్‌ పెరీరా (1)ని నసూమ్‌ పెవిలియన్‌కి పంపాడు. తర్వాత వచ్చిన అసలంక.. ఓపెనర్ నిశాంక (24)తో కలిసి ఇన్నింగ్స్‌ని గాడిలో పెట్టాడు. ముఖ్యంగా హసలంక ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే, షకీబ్‌ వేసిన తొమ్మిదో ఓవర్లో నిశాంక, ఫెర్నాండో (0) ఔటయ్యారు. తర్వాతి ఓవర్లోనే హసరంగ (6) కూడా పెవిలియన్‌ చేరాడు. మహ్మదుల్లా వేసిన 14 ఓవర్‌లో హసలంక రెండు సిక్సర్లు బాదాడు. సైఫ్‌ఉద్దీన్‌ వేసిన 16 ఓవర్లో రాజపక్స చెలరేగి ఆడాడు. ఏకంగా రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు బాదేయడంతో శ్రీలంక విజయం ఖరారైపోయింది. బంగ్లా బౌలర్లలో షకీబ్ హల్‌ హసన్‌, సైఫ్‌ఉద్దీన్  రెండు వికెట్లు తీయగా.. నసూమ్ వికెట్ పడగొట్టాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు