Dipa Karmakar: జులైలో వచ్చేస్తా.. రెండేళ్లపాటు నిషేధం అనేది తప్పుడు ఆరోపణే: దీపా కర్మాకర్
నిషిద్ధ ఉత్ర్రేరకాలు తీసుకున్నట్లు డోపింగ్ పరీక్షలో తేలడంతో భారత స్టార్ (Team India) జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌పై (Dipa Karmakar) అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఏటీఏ) 21 నెలల నిషేధం విధించింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ (Dipa Karmakar)పై అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఏటీఏ) 21 నెలల నిషేధం విధించింది. ఆమె నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు పరీక్షల్లో తేలడంతో ఏటీఏ ఈ మేరకు చర్యలు తీసుకుంది. దీపాపై ఈ ఏడాది జులై 10 వరకు నిషేధం అమలులో ఉంటుందని పేర్కొంది. నిషేధిత ఉత్ప్రేరకం హిగనమైన్ పరీక్షలో ఆమె పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో ఆమె డోపింగ్‌కు పాల్పడినట్లు రుజువైంది. 2021 అక్టోబర్ 11న దీపా కర్మాకర్ నుంచి శాంపిల్స్ సేకరించారు. అప్పుడే డోపింగ్ టెస్టులో పట్టుబడింది. కానీ, ఈ విషయాన్ని ఇప్పుడు ప్రకటించారు. శిక్షాకాలం అప్పటి నుంచి అమలుకావడంతో 2023 జులై 10తో నిషేధం ముగుస్తుంది. 2016లో రియో ఒలింపిక్స్‌లో వాల్ట్‌లో దీపా కర్మాకర్ నాలుగో స్థానం సాధించింది.
ఈ విషయంపై దీపా కర్మాకర్ ట్విటర్‌లో ఓ పోస్టు చేసింది. ‘ఈ రోజు నా కోసం, నా కెరీర్ కోసం నేను చేసిన సుదీర్ఘ పోరాటానికి ముగింపు లభించింది. 2021 అక్టోబర్‌లో నా నుంచి శాంపిల్స్ తీసుకుని పరీక్షించడానికి పంపారు. నేను నిషేధిత పదార్థాన్ని తీసుకున్నట్లు అందులో తేలింది. అది ఎలా నా శరీరంలోకి చేరిందో గుర్తించలేకపోయాను. నాపై రెండేళ్లు సస్పెన్షన్ విధించినట్లు చాలా మీడియా సంస్థల్లో వార్తలొస్తున్నాయి. అవన్నీ తప్పుడు కథనాలు. నా శిక్షా కాలాన్ని మూడు నెలలు తగ్గించారు. దీంతో జూలై 2023లో తిరిగి నాకిష్టమైన ఆటను మళ్లీ మొదలుపెడతా’ అని దీపా కర్మాకర్ పేర్కొంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
LB nagar flyover : ఇక సిగ్నల్ ఫ్రీగా ఎల్బీనగర్ కూడలి.. నేడు మరో పైవంతెన అందుబాటులోకి
-
Sports News
IPL: ‘బీసీసీఐ ఎలాంటి ఆదేశాలివ్వలేదు’ : దిల్లీ క్యాపిటల్స్ సీఈవో
-
Crime News
Crime News: కొండపైకి గంజాయి.. తితిదే ఉద్యోగి అరెస్టు
-
Crime News
Fire accident : కారు మెకానిక్ షెడ్లో అగ్ని ప్రమాదం.. ఒకరి సజీవదహనం..
-
India News
Rahul Gandhi : రాహుల్ అధికార బంగళా ఖాళీ చేయాల్సిందేనా!