RAshwin: కౌంటీ క్రికెట్లో తొలిరోజే యాష్‌  రికార్డు

టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన ఘనత సాధించాడు. 11 ఏళ్ల తర్వాత కౌంటీ క్రికెట్లో తొలి ఓవర్‌ వేసిన స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు. 2010లో జీతన్‌ పటేల్‌ ఆరంభ ఓవర్‌ వేయగా మళ్లీ ఇన్నాళ్లకు యాష్‌ వేశాడు...

Published : 12 Jul 2021 12:32 IST

లండన్‌: టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన ఘనత సాధించాడు. 11 ఏళ్ల తర్వాత కౌంటీ క్రికెట్లో తొలి ఓవర్‌ వేసిన స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు. 2010లో జీతన్‌ పటేల్‌ ఆరంభ ఓవర్‌ వేయగా మళ్లీ ఇన్నాళ్లకు యాష్‌ వేశాడు.

ప్రస్తుతం కోహ్లీసేన ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ముగిశాక జట్టు సభ్యులకు మూడు వారాల విరామం ప్రకటించారు. కొన్నిరోజులు కుటుంబంతో కలిసి బ్రిటన్‌ చుట్టొచ్చిన అశ్విన్‌కు సర్రే నుంచి ఆహ్వానం అందింది. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీసుకు మ్యాచ్‌ ప్రాక్టీస్‌ దొరుకుతుందని అతడూ అంగీకరించాడు.

ఆదివారం సోమర్‌సెట్‌, సర్రే మధ్య మ్యాచ్‌ మొదలైంది. పిచ్‌ మందకొడిగా ఉండటంతో సర్రే సారథి రోరీ బర్న్స్‌ కొత్త బంతిని మొదట యాష్‌ చేతికి ఇచ్చాడు. మొత్తంగా అతడు తొలిరోజే 28 ఓవర్లు వేయడం గమనార్హం. 5 ఓవర్లు మెయిడిన్‌ వేసిన అశ్విన్‌ 70 పరుగులిచ్చి టామ్‌ లామన్‌బి (42) వికెట్‌ పడగొట్టాడు.

ఈ మ్యాచులో అశ్విన్‌ ఎక్కువగా వైవిధ్యం ప్రదర్శించలేదు. పిచ్‌ను దృష్టిలో ఉంచుకొని ఒకే ప్రాంతంలో నిలకడగా బంతులు విసిరి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తెచ్చాడు. బంతి ఎక్కువగా టర్న్‌ కానప్పటికీ అతడు తెలివిగా బౌలింగ్‌ చేశాడు. చెత్త బంతులు వేయలేదు. 25 ఓవర్ల పాటు చక్కని లైన్‌ అండ్‌ లెంగ్త్‌ల్లో బంతులేశాడు. కేవలం 5 బౌండరీలే ఇచ్చాడు. కాగా తొలిరోజు ఆట ముగిసే సరికి సోమర్‌సెట్‌ 98 ఓవర్లకు 280/6తో నిలిచింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు