AUS vs WI: వెస్టిండీస్‌తో టెస్టులో సరికొత్త రికార్డు.. లెజెండ్ సరసన చేరిన స్టీవ్ స్మిత్
వెస్టిండీస్‌తో టెస్టు మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత సొంతం చేసుకొన్నాడు. దిగ్గజ ఆటగాడు డొనాల్డ్ బ్రాడ్‌మన్ రికార్డును సమం చేశాడు.
పెర్త్: ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నాడు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, దిగ్గజం సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ నెలకొల్పిన ఫీట్‌ను అందుకొన్నాడు. తన టెస్టు కెరీర్లో స్టీవ్ స్మిత్ 29వ శతకం నమోదు చేశాడు. దీంతో బ్రాడ్‌మన్ రికార్డును సమం చేశాడు. స్మిత్ ఇన్నింగ్స్‌తో విండీస్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. బ్రాడ్‌మన్ 52 టెస్టుల్లో సాధించగా.. స్మిత్‌కిది 88వ టెస్టు. టెస్టు సిరీస్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ 51 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. స్మిత్ ఇంకో సెంచరీ చేస్తే ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ హెడెన్ సరసన చెరుతాడు. ఆసీస్ జట్టులో రికీ పాంటింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. 168 మ్యాచ్‌ల్లో 41 సెంచరీలు చేశాడు. ఇక 168 మ్యాచ్‌ల్లో 32 శతకాలతో స్టీవ్‌వా రెండో స్థానంలో ఉన్నాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Jupiter: గురు గ్రహం చుట్టూ 12 కొత్త ఉపగ్రహాలు
-
Sports News
Deepti Sharma: ముక్కోణపు సిరీస్ అనుభవాలతో ప్రపంచకప్ బరిలోకి దిగుతాం: దీప్తి శర్మ
-
India News
Jammu Kashmir: జోషీమఠ్ తరహాలో.. జమ్మూలోనూ ఇళ్లకు పగుళ్లు..!
-
Latestnews News
MCC: పరిహాసానికి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: ఆండ్రూ స్ట్రాస్
-
India News
Traffic Challan: పరిమిత కాలపు ఆఫర్.. ట్రాఫిక్ చలాన్లపై 50 శాతం డిస్కౌంట్!
-
Sports News
Prithvi Shaw: భారత ఓపెనర్‌గా పృథ్వీ షాకు అవకాశాలు ఇవ్వాలి: ఇర్ఫాన్ పఠాన్