IND vs AUS: వన్డే సిరీస్‌కు కమిన్స్ దూరం.. స్టీవ్‌ స్మిత్‌కు సారథ్య బాధ్యతలు

 భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌కు ఆస్ట్రేలియా రెగ్యులర్‌ కెప్టెన్‌ కమిన్స్‌ దూరమయ్యాడు. దీంతో స్టీవ్‌ స్మిత్‌ (Steve Smith) సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు.

Published : 14 Mar 2023 23:46 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్‌, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య మార్చి 17 నుంచి మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభంకానుంది.  తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటంతో బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో మొదటి రెండు టెస్టులు ముగియగానే ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్ కమిన్స్‌ (Pat Cummins) భారత పర్యటన నుంచి అర్ధాంతరంగా స్వదేశానికి వెళ్లిన విషయం తెలిసిందే. ఆమె ఇటీవల కన్నుమూసింది. కమిన్స్‌ ఆస్ట్రేలియాకు పయనమవడంతో మిగిలిన రెండు టెస్టులకు స్టీవ్‌ స్మిత్ (Steve Smith) సారథ్య బాధ్యతలు చూసుకున్నాడు. కమిన్స్‌ వన్డే సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండడని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌కు స్టీవ్‌ స్మిత్‌ కెప్టెన్‌గా నియమించింది. మరోవైపు, వెన్ను గాయంతో బాధపడుతున్న శ్రేయస్‌ అయ్యర్‌ ఆసీస్‌తో నాలుగో టెస్టులో బ్యాటింగ్‌ చేయలేదు.  అతడు కోలుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌కు శ్రేయస్‌ దూరమయ్యాడు. ఐపీఎల్‌లో కూడా ఆడటం కూడా అనుమానంగా మారింది. వ్యక్తిగత కారణాలరీత్యా మొదటి వన్డేకు కెప్టెన్‌ రోహిత్‌ దూరంగా ఉండనున్నాడు. ఆ మ్యాచ్‌కు హార్దిక్‌ పాండ్య నాయకత్వం వహిస్తాడు. 

భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్‌), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్, వాషింగ్టన్ సుందర్, చాహల్, షమీ, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనద్కత్.

ఆసీస్‌ జట్టు:

స్టీవ్ స్మిత్ (కెప్టెన్‌), సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కేరీ, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్‌ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్‌, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టొయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని