IPL 2023: ఐపీఎల్ 2023.. సరికొత్త పాత్రలో స్టీవ్ స్మిత్!
ఐపీఎల్‌లోకి (IPL 2023) ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ అడుగు పెట్టేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఈసారి మాత్రం ఏ జట్టు తరఫున ఆడేందుకు కాదు. మరి మెగా లీగ్‌లో అతడి కొత్త పాత్ర ఏంటో తెలుసుకోండి.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) పదహారో సీజన్ ప్రారంభానికి కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో క్రికెట్ అభిమానులను అలరించడానికి ఆసీస్ తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ సిద్ధమైపోయాడు. అదేంటి, గత ఐపీఎల్ మినీ వేలంలో స్మిత్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు కదా..? మరెలా అతడు ఐపీఎల్‌లో కనిపిస్తాడనేదేగా మీ అనుమానం. అయితే, ఈసారి స్టీవ్ స్మిత్ ప్లేయర్‌గా మైదానంలో దిగడం లేదు. సరికొత్త పాత్రను పోషించేందుకు సిద్దమయ్యాడు. అదే కామెంటేటర్.. ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ కూడా దీనిని ధ్రువీకరించింది. రెండు రోజుల కిందట తాను ఐపీఎల్‌కు వస్తానని స్మిత్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఏదైనా ఫ్రాంచైజీ రిప్లేస్‌మెంట్ చేసుకుంటుందేమోనని అంతా భావించారు. తీరా ఇప్పుడు కామెంట్రీ ప్యానెల్‌లోకి రావడ విశేషం.
‘‘మెగా లీగ్‌లో స్టీవ్ స్మిత్ భాగం కానున్నాడు. వ్యాఖ్యాతల బృందంతో చేరతాడు. స్టార్ స్పోర్ట్స్‌తోనే కామెంట్రీ ప్రారంభించడం ఆనందంగా ఉంది’’ అని బ్రాడ్‌కాస్టర్ ఓ ప్రకటన విడుదల చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీపై నిషేధం పడిన సమయంలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌ను కెప్టెన్‌గా ఫైనల్‌కు చేర్చిన అనుభవం స్మిత్ సొంతం. అయితే, గత మినీ వేలంలో కనీస ధర రూ. 2 కోట్లతో వచ్చినప్పటికీ.. అతడిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. తాజాగా భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆసీస్‌ను విజేతగా నిలిపాడు. ఒక టెస్టులోనూ తన జట్టును గెలిపించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World Culture Festival: ఉక్రెయిన్‌లో శాంతిస్థాపన కోసం 180 దేశాల ప్రజల ప్రార్థన
-
GST collections: సెప్టెంబరు జీఎస్టీ వసూళ్లు రూ.1.62 లక్షల కోట్లు.. 10% వృద్ధి
-
Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Rohit Sharma: నా దృష్టిలో అతడే కఠినమైన బౌలర్: రోహిత్ శర్మ
-
PM Modi: తెలంగాణలో వచ్చే ఎన్నికల తర్వాత చెప్పింది చేసే ప్రభుత్వం: ప్రధాని మోదీ
-
TMC: దిల్లీలో మాపై లాఠీలు విరిగితే.. పశ్చిమబెంగాల్లోనూ విరుగుతాయ్ : బెంగాల్ మంత్రి పార్థ భౌమిక్