స్ట్రాంజా మెమోరియల్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్ ఫైనల్‌కు తెలుగు యువతి

 సోఫియా వేదికగా జరుగుతున్న మహిళల 73వ స్ట్రాండ్జా మెమోరియల్‌ బాక్సింగ్ టోర్నమెంట్‌ రెండు విభాగాల్లో...

Updated : 26 Feb 2022 09:48 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సోఫియా వేదికగా జరుగుతున్న మహిళల 73వ స్ట్రాంజా  మెమోరియల్‌ బాక్సింగ్ టోర్నమెంట్‌ రెండు విభాగాల్లో ఫైనల్స్‌కు ఇద్దరు భారతీయ బాక్సర్లు చేరుకున్నారు. తెలుగు యువతి జూనియర్‌ వరల్డ్‌ మాజీ ఛాంపియన నిఖత్‌ జరీన్‌ 52 కేజీల విభాగంలో, నీతు 48 కేజీల కేటగిరీలో ఫైనల్స్‌ బెర్తులను దక్కించుకున్నారు. తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన నిఖత్‌ జరీన్‌ సెమీస్‌లో ఒలింపిక్స్ రజత పతక విజేత, టర్కీ క్రీడాకారిణి బుసె నాజ్ కకిరోగ్లును 4-1 తేడాతో చిత్తు చేసింది. మొదటి రౌండ్‌లో కాస్త ప్రతిఘటన ఎదురైనా చివరికి నిఖత్ విజృంభించడంలో పోరు ఏకపక్షమైంది. నిఖత్‌ 2019 ఇదే టోర్నీ విజేత కావడం విశేషం. 

మరోవైపు 48 కేజీల విభాగంలో హరియాణాకు చెందిన నీతు సెమీస్‌లో ఉక్రెయిన్‌కు చెందిన హన్నా ఓక్తోపై విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. హన్నా ఓక్తో 2018 వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ రజత పతక విజేత. ఓక్తోపై తొలి రౌండ్ నుంచే ఆధిక్యత ప్రదర్శించిన నీతు.. రెండో రౌండ్‌లోనూ అదే ఊపును కొనసాగించింది. ఇక మూడో రౌండ్‌కు ముందే ఉక్రెయిన్‌ బాక్సర్‌ బౌట్‌ను రద్దు చేసుకుంది. దీంతో నీతు ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ఉక్రెయిన్‌ బాక్సర్‌ ఓక్తో అనుచిత ప్రవర్తనకు పాల్పడింది. రెండో రౌండ్ ముగింపు సందర్భంగా నీతుపై టవల్‌ను విసిరి కొట్టింది. ‘‘నీతు అద్భుతమైన విజయం సాధించింది. ఉక్రెయిన్‌ ప్లేయర్‌ త్వరగా అలసిపోయింది. మూడో రౌండ్‌లో బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో నీతును విజేతగా ప్రకటించారు’’ అని టీమ్‌ఇండియా మహిళల కోచ్‌ భాస్కర్‌ భట్ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు