Ashes Test Series: ఇంగ్లాండ్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ మరో ఘనత..

ఆస్ట్రేలియాలో జరుగుతున్న యాషెస్‌ టెస్ట్‌ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ బౌలర్‌ స్టువర్ట్ బ్రాడ్‌ మరో రికార్డు సృష్టించాడు. 150 టెస్టు మ్యాచులు ఆడిన మూడో ఇంగ్లాండ్ ఆటగాడిగా ఘనత సాధించాడు. ఇంగ్లాండ్..

Published : 16 Dec 2021 19:00 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆస్ట్రేలియాలో జరుగుతున్న యాషెస్‌ టెస్ట్‌ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ బౌలర్‌ స్టువర్ట్ బ్రాడ్‌ మరో రికార్డు సృష్టించాడు. 150 టెస్టు మ్యాచులు ఆడిన మూడో ఇంగ్లాండ్ ఆటగాడిగా ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ తరఫున ఇతని కంటే ముందు జేమ్స్‌ అండర్సన్‌ (167 టెస్టులు), అలెస్టర్ కుక్‌ (161 టెస్టులు) ముందున్నారు. భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ (200 టెస్టులు) అగ్రస్థానం ఆక్రమించాడు. 2007లో టెస్టు క్రికెట్లోకి అడుగు పెట్టిన బ్రాడ్ ఇప్పటి వరకు ఆడిన 525 వికెట్లు పడగొట్టాడు. దీంతో టెస్టు ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన ఆరవ ఆటగాడిగా నిలిచాడు. 800 వికెట్లతో ముత్తయ్య మురళీధరన్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా, యాషెస్‌ టెస్టు సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు.. తొలి రోజు ఆట ముగిసే సరికి ఆస్ట్రేలియా 221/2 స్కోరుతో నిలిచింది. మార్నస్ లబూషేన్‌ (95: 275 బంతుల్లో 7x4), కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్ (18) క్రీజులో కొనసాగుతున్నారు. ఓపెనర్‌ డేవిడ్ వార్నర్‌ (95: 167 బంతుల్లో 11x4) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టువర్ట్‌ బ్రాడ్, బెన్‌ స్టోక్స్ తలో వికెట్ తీశారు.

Read latest Sports News and Telugu News



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు