ఆ విషయంలో భారత్‌ను తప్పుబట్టలేం..!
భారత్‌తో జరిగిన రెండో టెస్టులో పిచ్ అనూహ్యంగా తిరగడంపై ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ స్పందించాడు. అందులో తప్పుపట్టాల్సిన విషయమేం లేదన్నాడు. తమ జట్టులో పిచ్‌ను విమర్శించే...
అనుకూల పిచ్‌లపై స్టువర్ట్‌బ్రాడ్
ఇంటర్నెట్‌డెస్క్: భారత్‌తో జరిగిన రెండో టెస్టులో పిచ్ అనూహ్యంగా తిరగడంపై ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ స్పందించాడు. అందులో తప్పుపట్టాల్సిన విషయమేం లేదన్నాడు. తమ జట్టులో పిచ్‌ను విమర్శించే ఆలోచనే లేదని స్పష్టం చేశాడు. ఏ జట్టుకైనా స్వదేశంలో క్రికెట్ జరిగితే అనుకూల పిచ్‌లు సిద్ధం చేసుకునే హక్కు ఉంటుందని చెప్పాడు. కాబట్టి, భారత్ హోమ్ అడ్వాంటేజ్‌ను ఉపయోగించుకుంటుందని తెలిపాడు. కాగా, రెండో టెస్టులో కోహ్లీసేన తమకంటే మంచి ప్రదర్శన చేసిందని, పిచ్‌ను సద్వినియోగం చేసుకొని రాణించిందని బ్రాడ్ ఓ అంతర్జాతీయ పత్రికకు వెల్లడించాడు.
ఇక 2018లో లార్డ్స్‌లో జరిగిన టెస్టులోనూ తాము ఇలాగే చేశామని బ్రాడ్ గుర్తుచేసుకున్నాడు. స్వింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌పై భారత్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తక్కువ స్కోరుకే పరిమితమైందని, దాంతో తమ జట్టు ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించిందని ఇంగ్లాండ్ పేసర్ చెప్పుకొచ్చాడు. మరోవైపు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఇలా ఏ జట్టును తీసుకున్నా వారి సొంత దేశాల్లో ఇలాగే చేస్తారని బ్రాడ్ పేర్కొన్నాడు. అది హోమ్ అడ్వాంటేజ్ అని పేర్కొన్నాడు. కాగా, తొలి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లాండ్ రెండో టెస్టులో భారీ తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమానంగా నిలిచింది. ఇక ఈనెల 24 నుంచి మొతేరా మైదానంలో ఇరు జట్లూ మూడో మ్యాచ్ ఆడనున్నాయి. ఇది డే/నైట్ టెస్టు కావడంతో మరింత ఆసక్తి పెరిగింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WT20 WC 2023: మహిళల టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా షెడ్యూల్ ఇదే
-
Crime News
Rajasthan: పెట్రోల్ ట్యాంకర్లో మద్యం అక్రమ రవాణా..!
-
World News
Australia: డాల్ఫిన్లతో ఈతకని దిగి.. సొర చేపకు చిక్కి..!
-
Sports News
Gill: ‘శుభ్‌మన్.. నాగ్‌పుర్ ఏదో చెబుతోంది చూడు’’: ఉమేశ్ యాదవ్ ఫన్నీ ట్వీట్
-
World News
Wikipedia: పాక్‌లో వికీపీడియాపై నిషేధం.. స్పందించిన వికీమీడియా
-
General News
Rushikonda: బోడికొండకు కవరింగ్.. జర్మన్ టెక్నాలజీతో జియో మ్యాటింగ్