IND vs AUS: ట్రావిస్ హెడ్‌పై శ్రేయస్ జోకులు.. స్టంప్ మైక్‌లో రికార్డు
ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్(Travis Head) బ్యాటింగ్ సరళిని ఉద్దేశిస్తూ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) చేసిన వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో రికార్డయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్-గావస్కర్ ట్రోఫీ(Border - Gavaskar Trophy)లో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించిన టీమ్‌ఇండియా.. మూడో మ్యాచ్(IND vs AUS)లో బొక్కబోర్లా పడింది. ఇందౌర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి.. ఈ సిరీస్‌లో భారత ఆధిక్యాన్ని 2-1కి తగ్గించడమే కాకుండా, డబ్ల్యూటీసీ ఫైనల్(WTC Final)లోకి దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఛేజింగ్ చేస్తున్న సమయంలో ట్రావిస్ హెడ్(Travis Head)ని శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) ఏదో అనడం స్టంప్ మైక్‌లో రికార్డయ్యింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
ఆరో ఓవర్‌లో రవీంద్ర జడేజా( Ravindra Jadeja ) బౌలింగ్ చేస్తున్న సమయంలో షార్ట్ ఫైన్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయస్.. హెడ్‌ను ఉద్దేశిస్తూ ‘అతడి ఒక కాలు చండీగఢ్‌లో ఉంటే.. మరో కాలు హరియాణాలో ఉంది’ అంటూ హిందీలో అనడం వినిపించింది. అయితే ఈ వ్యాఖ్యలు అర్థం కాకపోవడంతో హెడ్ ప్రతిస్పందించకుండా అలాగే ఉండిపోయాడు.
ఇక ఈ మ్యాచ్(IND vs AUS)లో ట్రావిస్ హెడ్ (49 నాటౌట్), మార్నస్ లబుషేన్ (28 నాటౌట్) రాణించడంతో.. భారత్ విధించిన 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 18.5 ఓవర్లలోనే, ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
చైనా చొరబాటుపై అమెరికా ముందే చెప్పిందా..? శ్వేతసౌధం స్పందన ఇదే..!
-
Sports News
Virat Kohli: విరాట్ కోహ్లీ.. టీ20లు ఆడటం ఆపేయ్: షోయబ్ అక్తర్
-
India News
Death Penalty: ‘ఉరి’ విధానం క్రూరమైందా..? సుప్రీంకోర్టు ఏమంటోంది..!
-
Politics News
Rahul Gandhi: స్పీకర్‌జీ..వివరణ ఇచ్చేందుకు అనుమతివ్వండి: రాహుల్
-
Movies News
Suriya42: ‘బాహుబలి’, ‘కేజీయఫ్’ రేంజ్లో సూర్య మూవీ ఉంటుందట!
-
India News
Nitish Kumar: ‘హిందీని చంపేస్తారా’.. మండలి ఛైర్మన్‌పై నీతీశ్ ఆగ్రహం!