Published : 10 Apr 2022 01:23 IST

Rahul Tewatia : తెవాతియా నరాల్లో ఏం పరుగులు తీస్తుందో...?: సునిల్‌ గావస్కర్‌

ఇంటర్నెట్ డెస్క్‌: పంజాబ్‌పై ఆఖరి రెండు బంతుల్లో సిక్సర్లు కొట్టి గుజరాత్‌ను గెలిపించిన రాహుల్‌ తెవాతియాపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. తీవ్ర ఒత్తిడిలో తెవాతియా అద్భుత ప్రదర్శన చేశాడని టీమ్‌ఇండియా మాజీ దిగ్గజం సునిల్ గావస్కర్‌ కొనియాడాడు. ‘‘తెవాతియా బ్యాటింగ్‌కు దిగే సమయానికి గుజరాత్‌ను ఎవరు గట్టెక్కిస్తారనే పరిస్థితిలో ఉంది. అయితే తెవాతియా ఆ లోటును పూరిస్తూ చెలరేగాడు. చివర్లో ఆఫ్‌స్టంప్‌ అవతలకి వెళ్లి మరీ సిక్సర్‌ కొట్టాడు. దీంతో ఓడియన్‌ స్మిత్‌ మీద ఒత్తిడి పెరిగిపోయింది. అందుకే కోచ్‌లు ఇలాంటి పరిస్థితుల్లో ఎలా బంతిని సంధించాలో బౌలర్లకు చూపించడంలో కీలక పాత్ర పోషించాలి. తెవాతియా ఆడిన మూడు బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టడం విశేషం. అది అద్భుతమనే చెప్పాలి. అతడి నరాల్లో ఏం పరుగులు తీస్తుందో? నాకైతే అది బ్లడ్‌లా లేదు.. ఐస్‌ అనుకుంటున్నా’’ అని సునిల్ గావస్కర్‌ పేర్కొన్నాడు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్‌ (64), ధావన్‌ (35), జితేశ్‌ శర్మ (23), రాహుల్ చాహర్ (22*) రాణించారు. గుజరాత్‌ బౌలర్లలో రషీద్ ఖాన్‌ 3, దర్శన్ 2.. షమీ, హార్దిక్‌ పాండ్య, ఫెర్గూసన్ తలో వికెట్‌ తీశారు. అనంతరం గుజరాత్‌ కూడా సరిగ్గా 20 ఓవర్లకే నాలుగు వికెట్లను కోల్పోయి 190 పరుగులు చేసి విజయం సాధించింది. ఆఖరి ఓవర్‌లో 19 పరుగులు అవసరం కాగా.. ఓడియన్‌ స్మిత్ వేసిన తొలి నాలుగు బంతులకు ఏడు పరుగులు మాత్రమే వచ్చాయి. మిగిలిన రెండు బంతులకు సిక్స్‌లు కొట్టిన తెవాతియా గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని