అశ్విన్ 5 సెంచరీలు ఎలా చేశాడో చూపించాడు.. క్లిష్ట సమయాల్లో ఆడటం శ్రేయస్ స్పెషల్
టీమ్ఇండియా ఆటగాళ్లు అశ్విన్, శ్రేయస్‌పై అభినందనల వర్షం కురుస్తోంది. బంగ్లాదేశ్‌పై రెండో టెస్టులో భారత్ విజయం సాధించడంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాతో రెండో టెస్టులో ఓటమి గండం నుంచి తప్పించి విజయతీరాలకు చేర్చిన రవిచంద్రన్ అశ్విన్ - శ్రేయస్ అయ్యర్ జోడీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్‌తోపాటు సీనియర్ ప్లేయర్ దినేశ్ కార్తిక్ పొగడ్తలతో ముంచెత్తారు. టర్నింగ్ పిచ్‌పై ఎనిమిదో వికెట్‌కు అర్ధశతక (71) భాగస్వామ్యం నిర్మించడం అద్భుతమని కొనియాడారు. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు భారత్ చేరువైంది. ఈ క్రమంలో ఓ క్రీడా ఛానెల్‌తో గావస్కర్, దినేశ్ కార్తిక్ మాట్లాడారు.
ఏమాత్రం వెనకడుగు వేయలేదు: గావస్కర్
‘‘ఇద్దరూ ఎంతో ఏకాగ్రతతో, నిశ్శబ్దంగా భారత్‌ను గెలిపించారు. బయట ఉన్న మనకే చాలా టెన్షన్ ఉంది. అలాంటిది క్రీజ్‌లో ఉన్న వారికి మాటల్లో చెప్పలేనంత ఒత్తిడికి లోనుకావడం సహజం. అశ్విన్ అయితే కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. చాలా మంది అభిమానులు కేవలం అశ్విన్ బౌలింగ్ గురించే మాట్లాడుతుంటారు. అతడికి టెస్టుల్లో 5 సెంచరీలు ఉన్నాయి. ఇవన్నీ ఎలా సాధించాడో ఇవాళ తన అద్భుత బ్యాటింగ్‌తో మనకు చూపించాడు. శ్రేయస్‌తో కలిసి సూపర్ పార్ట్నర్షిప్ నిర్మించాడు. పరుగులు చేసేందుకు వారే అవకాశాలను సృష్టించుకొన్నారు. అలాంటి షాట్లు కొట్టేందుకు ఏమాత్రం జంకలేదు. మరీ ముఖ్యంగా శ్రేయస్ లాఫ్ట్డ్ షాట్‌ను కొట్టిన విధానం అద్భుతం. దీంతో బౌలర్లపై ఒత్తిడి తీసుకొచ్చాడు’’
అవకాశాలను ఉపయోగించుకున్నాడు.. : డీకే
‘‘శ్రేయస్ అయ్యర్ ఈ టెస్టు సిరీస్ సాంతం అద్భుతంగా ఆడాడు. వచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకొన్నాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఓపిగ్గా బ్యాటింగ్ చేయడం సులువైన విషయం కాదు. మరోసారి తన ఎంత నాణ్యమైన ఆటగాడినో శ్రేయస్ తన ఆటతీరుతో తెలిసేలా చేశాడు. ఇలా చాలాసార్లు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జట్టును ఆదుకొనే ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా నిశ్శబ్దంగా తన పని పూర్తి చేశాడు. ఇక నాలుగో స్థానంలో అక్షర్ పటేల్‌ను పంపించడం సరైన నిర్ణయం. శ్రేయస్ క్రీజ్‌లోకి వచ్చేవరకు బంగ్లా బౌలింగ్‌ను కాచుకొని ఉన్నాడు. అతడు చేసిన 34 పరుగులు చాలా విలువైనవి. బంతి బాగా టర్నింగ్ అయిన పిచ్‌పై ఆడటం చాలా కష్టం. అంతేకాకుండా షకిబ్, తైజుల్, మెహిదీ అద్భుతంగా బంతులను సంధించారు’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్