గిల్‌కు 21 ఏళ్లే.. ప్రశాంతంగా ఉండాలి: గావస్కర్‌

టీమ్‌ఇండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్‌ ఇంకా 21 ఏళ్ల కుర్రాడని, ప్రశాంతంగా ఉంటూనే వైఫల్యాల నుంచి నేర్చుకోవాలని దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు...

Published : 09 May 2021 10:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్‌ ఇంకా 21 ఏళ్ల కుర్రాడని, ప్రశాంతంగా ఉంటూనే వైఫల్యాల నుంచి నేర్చుకోవాలని దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. గతేడాది ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌ల్లో 440 పరుగులు చేసిన అతడు ఈసారి టోర్నీ వాయిదా పడకముందు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 132 పరుగులే చేశాడు. దాంతో అతడిపై ఒత్తిడి పెరిగిందని గావస్కర్‌ ఓ క్రీడా ఛానల్‌తో అన్నాడు.

‘గిల్‌ ఇలా ఉన్నపళంగా విఫలమవ్వడానికి కారణం నాకు తెలిసి అంచనాల పెరిగి ఒత్తిడికి గురవ్వడమే. ఐపీఎల్‌ కన్నా ముందు పరిస్థితులు వేరు. అతడో నమ్మకమైన యువ బ్యాట్స్‌మన్‌గా ఉన్నాడు. అయితే, ఆస్ట్రేలియా పర్యటనలో అతడి ఆట చూశాక బాగా ఆడతాడనే అంచనాలు పెరిగాయి. ఆ ఒత్తిడి కారణంగానే ఇలా విఫలమవుతున్నాడని అనిపిస్తోంది. అతడిప్పుడు ప్రశాంతంగా ఉండాలి. ఇంకా 21 ఏళ్ల కుర్రాడే. ఎవరికైనా వైఫల్యాలు ఉంటాయి. వాటి నుంచి నేర్చుకోవాలి. అతడు ఓపెనింగ్‌ చేస్తూ దేని గురించి ఆలోచించకుండా స్వేచ్ఛగా ఆడాల్సి ఉంది. సహజసిద్ధమైన ఆట ఆడితే పరుగులవే వస్తాయి’ అని గావస్కర్‌ వివరించాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని