IND vs AUS: రోహిత్, పుజారా తమ కోపాన్ని ప్రదర్శించే ఉంటారు: సునీల్ గావస్కర్
నాలుగో టెస్టులో బ్యాటర్లకు పూర్తిగా అనుకూలించిన పిచ్‌ను సరిగ్గా ఉపయోగించుకోనందుకు రోహిత్ శర్మ, పుజారా చాలా నిరాశ చెందాలని సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) అన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma).. (35) విఫలమయ్యాడు. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై మూడు ఫోర్లు, ఓ సిక్స్ బాది మంచి టచ్‌లో కనిపించిన హిట్‌మ్యాన్ కునెమన్ బౌలింగ్‌లో లబుషేన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సీనియర్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా ( Cheteshwar Pujara).. (42) కూడా భారీ స్కోరు చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై రోహిత్, పుజారా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడం గురించి భారత మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ (Sunil Gavaskar ) ఓ టీవీ ఛానల్‌లో మాట్లాడాడు. బ్యాటర్లకు పూర్తిగా అనుకూలించిన పిచ్‌ను సరిగ్గా ఉపయోగించుకోనందుకు రోహిత్ శర్మ, పుజారా చాలా నిరాశ చెందాలని గావస్కర్ అన్నాడు.
‘మీరు ఒక్కసారి క్రీజులో కుదురుకుని చూడండి. తర్వాత సెంచరీ చేయడం గురించి ఆలోచిస్తారు. రోహిత్ శర్మ, ఛెతేశ్వర్ పుజారా ఇద్దరూ క్రీజులో చక్కగా కుదురుకున్నారు. కానీ, ఇద్దరూ ఔట్ అయిన వెంటనే కోపం చూపించలేదు. కానీ వారు డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి ఒంటరిగా ఉన్నప్పుడు తమ కోపాన్ని ప్రదర్శించే ఉంటారు’ అని గావస్కర్ పేర్కొన్నాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 3/0 స్కోరుతో నిలిచింది. ట్రావిస్ హెడ్ (3 బ్యాటింగ్), కునెమన్ (0*) క్రీజులో ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 571 పరుగులకు ఆలౌటై 91 పరుగుల ఆధిక్యం సంపాదించింది. గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌కు దిగలేదు. విరాట్ కోహ్లీ (186), గిల్ (128) శతకాలతో అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 480 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
యూపీలో రోడ్డుపై మహిళను ఈడ్చుకెళ్లిన లేడీ కానిస్టేబుళ్లు
-
భారత్‌కు తిరిగి రానున్న శివాజీ ‘పులి గోళ్లు’!
-
‘సీఎం ఇంటికి కూతవేటు దూరంలోనే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం’
-
కన్నవారి నడుమ కుదరని ఏకాభిప్రాయం.. మూడేళ్ల చిన్నారికి పేరు పెట్టిన హైకోర్టు
-
Chandrababu: జైలులో నేడు చంద్రబాబు దీక్ష
-
తిరుమలలో బ్రేక్ దర్శనం, గదుల బుకింగ్‌కు ‘పే లింక్’ సందేశాలతో నగదు చెల్లింపు!