IND vs NZ Test Series:అందుకే హనుమ విహారిని ఎంపిక చేయలేదు: సునీల్ గవాస్కర్‌

తర్వలో న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు తెలుగు కుర్రాడు హనుమ విహారిని ఎంపిక చేయకపోవడం తాననేమి ఆశ్చర్యానికి గురిచేయలేదని టీమిండియా దిగ్గజ మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్‌ అన్నారు. అతడు గత

Published : 15 Nov 2021 01:40 IST

ఇంటర్నెట్ డెస్క్: త్వరలో న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు తెలుగు కుర్రాడు హనుమ విహారిని ఎంపిక చేయకపోవడం తాననేమి ఆశ్చర్యానికి గురిచేయలేదని టీమిండియా దిగ్గజ మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్‌ అన్నారు. అతడు గత కొన్ని నెలలుగా క్రికెట్‌ ఎక్కువగా ఆడకపోవడం వల్ల జట్టు నుంచి తప్పించారని గవాస్కర్‌ అభిప్రాయపడ్డారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో విహారి ఆడకపోవడం వల్ల అతడు సెలెక్టర్ల  దృష్టిలో పడలేదని పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో ఐపీఎల్‌లోని ప్రదర్శనలు జాతీయ జట్టులో ఎంపికలను ప్రభావితం చేస్తున్నాయని ఆయన చెప్పారు. నవంబర్‌ 25 నుంచి కివీస్‌తో జరిగే రెండు టెస్టులకు శుక్రవారం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. విహారిని  ఎంపిక చేయకపోవడంతో సెలెక్టర్లపై అనేక విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.  

‘నిజాయితీగా చెప్పాలంటే హనుమ విహారిని ఎంపిక చేయకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేయలేదు. అతడు గత మూడు, నాలుగు నెలల్లో ఎక్కువగా క్రికెట్ ఆడలేదు. ఐపీఎల్‌లో కూడా ఆడలేదు. కివీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు ఎంపికైన ఆటగాళ్లు కొంతకాలంగా క్రికెట్‌ ఆడుతున్నారు. వాళ్లు ఎంపిక కావడానికి ఇదే కారణం కావొచ్చు. ఇంకో విషయం ఏంటంటే.. ఐపీఎల్‌లో ప్రదర్శనలు ఆధారంగా కొంతమంది ఆటగాళ్లు సెలక్షన్ కమిటీ దృష్టిలో పడుతున్నారు. ఇలా జరుగుతుండటం చాలా సంవత్సరాలుగా చూస్తున్నాము.  హనుమ విహారి ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడలేదు. కాబట్టి అతడు సెలెక్టర్ల దృష్టిలో పడలేదు’ అని విశ్లేషించారు. 

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని