
Sunil Gavaskar: హెట్మెయర్పై సన్నీ వ్యాఖ్యలు అభ్యంతరకరం.. మండిపడుతున్న నెటిజన్లు
ఇంటర్నెట్‌డెస్క్: బ్యాటింగ్ దిగ్గజం, టీమ్ఇండియా మాజీ సారథి సునీల్ గావస్కర్‌పై నెటిజన్లు, రాజస్థాన్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిని వెంటనే భారత టీ20 లీగ్‌లో కామెంట్రీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. గతరాత్రి చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాట్స్‌మన్ షిమ్రన్ హెట్మెయర్పై సన్నీ చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం. అవి అభ్యంతరకరంగా ఉన్నాయంటూ నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
అసలేం జరిగిందంటే.. ఈ మ్యాచ్‌లో చెన్నై నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ 15 ఓవర్లకు 104/4తో నిలిచింది. అప్పటికి రవిచంద్రన్ అశ్విన్ (13), షిమ్రన్ హెట్మెయర్ (0) క్రీజులో ఉన్నారు. ఆ జట్టు విజయానికి చివరి 5 ఓవర్లలో 47 పరుగులు అవసరమయ్యాయి. ఆ సమయంలోనే ప్రత్యక్ష ప్రసారంలో కామెంట్రీ చేస్తున్న గావస్కర్ హెట్మెయర్ను ఉద్దేశించి ఇలా వ్యాఖ్యానించాడు. "Hetmyer's wife delivered, will Hetmyer deliver for the Royals now?" అని అన్నాడు. గావస్కర్ సరదాగా ‘డెలివర్’ అనే పదప్రయోగం చేశాడు. అది బెడిసికొట్టి నెటిజన్లకు కోపం తెప్పించింది. దీంతో గావస్కర్ వ్యాఖ్యలు నీచంగా ఉన్నాయంటూ, అవి అభ్యంతరకరం అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. వెంటనే కామెంట్రీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా, హెట్మెయర్ భార్య ఇటీవల ఓ బిడ్డకు జన్మనివ్వడంతో అతడు బయోబబుల్ వీడి స్వదేశానికి వెళ్లాడు. తర్వాత తిరిగొచ్చి గతరాత్రి జరిగిన మ్యాచ్‌లో పాల్గొన్నాడు. అయితే, ఈ కరీబియన్ బ్యాట్స్‌మన్ అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఆరు పరుగులకే ఔటై నిరాశపరిచాడు. కానీ, పట్టుదలగా ఆడిన అశ్విన్ (40 నాటౌట్; 23 బంతుల్లో 2x4, 3x6), రియన్ పరాగ్ (10 నాటౌట్; 10 బంతుల్లో 1x6)తో కలిసి మ్యాచ్‌ను గెలిపించాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Virat Kohli: కోహ్లీ వైఫల్యాల వెనుక అదే కారణం..: మిస్బా
-
Politics News
Dasoju Sravan: డ్రగ్స్‌కు ఖైరతాబాద్ అడ్డాగా మారింది: దాసోజు శ్రవణ్
-
World News
Power Crisis: పాకిస్థాన్‌లో కరెంటు సంక్షోభం తీవ్రం.. మొబైల్, ఇంటర్నెట్ సేవలు బంద్..?
-
Sports News
IND vs ENG: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. భారత్ బ్యాటింగ్
-
Business News
GDP growth estimates: భారత జీడీపీ వృద్ధి అంచనాల్లో క్రిసిల్ కోత
-
India News
Maharashtra: మెట్రో కార్‌షెడ్‌పైనే శిందే తొలి నిర్ణయం.. మాజీ బాస్ నిర్ణయం పక్కకు..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS TET Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- Uddhav thackeray: ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Tollywood movies: ఏంటి బాసూ.. ఇలాంటి మూవీ తీశావ్..!
- Andhra News: రూ.వందల కోట్ల ఆర్థిక మాయ!
- ఈ మార్పులు.. నేటి నుంచి అమల్లోకి..
- Income Tax Rules: జులై 1 నుంచి అమల్లోకి రాబోతున్న 3 పన్ను నియమాలు..
- Nupur Sharma: నుపుర్ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాలి