Sunil Gavaskar: వాళ్ల గురించి ముందు ఊహించిందే: గావస్కర్
వచ్చేనెలలో శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్కు సీనియర్ బ్యాట్స్మెన్ అజింక్య రహానె, ఛెతేశ్వర్ పుజారా ఎంపికవ్వకపోవడం ఊహించిందేనని మాజీ సారథి, దిగ్గజ బ్యాట్స్మన్ సునీల్ గావస్కర్ అన్నాడు...
ఇంటర్నెట్డెస్క్: వచ్చేనెలలో శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్కు సీనియర్ బ్యాట్స్మెన్ అజింక్య రహానె, ఛెతేశ్వర్ పుజారా ఎంపికవ్వకపోవడం ఊహించిందేనని మాజీ సారథి, దిగ్గజ బ్యాట్స్మన్ సునీల్ గావస్కర్ అన్నాడు. శ్రీలంకతో టీ20, టెస్టు సిరీస్లకు సంబంధించి శనివారం బీసీసీఐ ఆయా జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో రహానె, పుజారాతో పాటు ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహాలకు కూడా చోటివ్వలేదు. ఈ నేపథ్యంలోనే మాట్లాడిన గావస్కర్ ఇలా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
‘ఇది ముందే ఊహించింది. దక్షిణాఫ్రికాలో ఆడిన మూడు టెస్టుల్లో ఇద్దరూ.. ఒక సెంచరీ లేదా 80, 90 పరుగులు చేసుంటే పరిస్థితులు మరోలా ఉండేవి. అక్కడ రహానె ఒక మంచి ఇన్నింగ్స్ ఆడినా.. జట్టుకు అవసరమైనప్పుడు, వాళ్లపై ఆశలు పెట్టుకున్నప్పుడు సరైనన్ని పరుగులు సాధించలేదు. అయితే, వాళ్లిద్దరూ తిరిగి జట్టులో స్థానం సంపాదించే అవకాశం లేకపోలేదు. రంజీ మ్యాచ్ల్లో నిలకడగా 200-250 పరుగులు సాధిస్తే కచ్చితంగా టీమ్ఇండియాలోకి వస్తారు. అయితే, ఈ టెస్టు సిరీస్ తర్వాత భారత్ ఇంగ్లాండ్లో ఒకే ఒక్క టెస్టు ఆడాల్సి ఉంది. ఆపై ఈ ఏడాది చివర్లోనే మళ్లీ టెస్టులు ఆడనుంది. దీంతో వారికి ఇప్పుడు సమయం అనుకూలంగా లేదనుకుంటా’ అని గావస్కర్ చెప్పుకొచ్చాడు. మరోవైపు అదే సమయంలో ఈ ఇద్దరి స్థానాల్లో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే తిరిగి జట్టులోకి రావడం కూడా కష్టమేనని దిగ్గజ బ్యాట్స్మన్ అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే అప్పటికే రహానె, పుజారా సుమారు 35 ఏళ్లకు చేరుతారని.. అలాంటప్పుడు యువకులతో పోటీ అంటే కష్టమేనని పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్