Sunil Gavaskar: మళ్లీ మనం 2016లో ఆడిన కోహ్లీని చూడొచ్చు: గావస్కర్‌

బెంగళూరు కెప్టెన్‌గా తప్పుకొన్న విరాట్‌ కోహ్లీ ఈసారి ఒక ఆటగాడిగా రాణిస్తాడని, మళ్లీ మనమంతా 2016 నాటి బ్యాట్స్‌మన్‌ను చూసే అవకాశం ఉందని బ్యాటింగ్‌...

Published : 28 Mar 2022 01:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బెంగళూరు కెప్టెన్‌గా తప్పుకొన్న విరాట్‌ కోహ్లీ ఈసారి ఒక ఆటగాడిగా రాణిస్తాడని, మళ్లీ మనమంతా 2016 నాటి బ్యాట్స్‌మన్‌ను చూసే అవకాశం ఉందని బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. తాజాగా ఓ క్రీడాఛానెల్‌తో మాట్లాడిన మాజీ కెప్టెన్‌.. కోహ్లీ బ్యాటింగ్‌పై స్పందించాడు.

‘ఎవరైనా కెప్టెన్‌గా ఉన్నప్పుడు మరో పది మంది ఆటగాళ్ల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఇతర సభ్యుల గురించి కూడా ఆలోచించాలి. వాళ్లు ఫామ్‌లో ఉన్నారా లేరా? ఎవరెలా ఆడతారు? జట్టుకు ఎవరు ఉపయోగపడతారు? ఇలా అన్ని విషయాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. అయితే, ఇప్పుడు కోహ్లీ కెప్టెన్సీ పగ్గాలు వదిలేశాడు కాబట్టి మనం మళ్లీ 2016 నాటి ఆటగాడిని చూడొచ్చు. అప్పుడు అతడు దాదాపు వెయ్యి (973) పరుగులు చేశాడు’ అని గావస్కర్‌ వివరించాడు. కాగా, విరాట్‌ గతేడాది టీ20 లీగ్‌ పూర్తయ్యాక జట్టు పగ్గాలు వదిలేస్తున్నట్లు ముందే ప్రకటించాడు. అన్నట్లే చేశాడు. ఇక తాజా సీజన్‌లో డుప్లెసిస్‌ను ఆ జట్టు కొత్త సారథిగా ఎంపిక చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని