
IPL 2022: ఆర్సీబీ నిర్ణయం సరైనదే.. దానికి నేనేం ఆశ్చర్యపోలేదు: గావస్కర్
ఇంటర్నెట్‌డెస్క్: రాబోయే ఐపీఎల్ మెగా సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తాజాగా దక్షిణాఫ్రికా మాజీ సారథి ఫా డుప్లెసిస్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించింది. ఈ విషయాన్ని టీమ్ఇండియా దిగ్గజ బ్యాట్స్‌మన్, మాజీ సారథి సునీల్ గావస్కర్ స్వాగతించాడు. ఆర్సీబీ చాలా మంచి నిర్ణయం తీసుకుందని కొనియాడాడు. గతేడాది ఐపీఎల్ టోర్నీ తర్వాత విరాట్ కోహ్లీ ఆ జట్టు సారథ్య బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గత నెల జరిగిన మెగా వేలంలో ఆర్సీబీ డుప్లెసిస్‌ను రూ.7 కోట్లకు కొనుగోలు చేయగా.. తాజాగా కెప్టెన్సీ పగ్గాలు అందించింది.
ఈ విషయంపైనే గావస్కర్ మాట్లాడుతూ ఇలా స్పందించాడు. ‘డుప్లెసిస్‌కు కెప్టెన్‌గా మంచి అనుభవం ఉంది. నాణ్యమైన కెప్టెన్సీ లక్షణాలను అతడిలో చూడొచ్చు. అతడిని కెప్టెన్‌గా చేయాలని బెంగళూరు తీసుకున్న నిర్ణయం నన్నేమీ ఆశ్చర్యానికి గురిచేయలేదు. అతడు దక్షిణాఫ్రికా జట్టును అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఒకానొక దశలో ఆ క్రికెట్ జట్టు గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంది. అలాంటి స్థితిలోనూ ఆటగాళ్లనందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చాడు. దీంతో ప్రపంచ క్రికెట్లో ఆ జట్టును అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాడు. ఇప్పుడు ఐపీఎల్లో అతడిని కెప్టెన్‌గా చేయాలనుకున్న ఆర్సీబీ చాలా మంచి నిర్ణయం తీసుకుంది’ అని అభిప్రాయపడ్డాడు. కాగా, ఐపీఎల్లో ట్రోఫీ సాధించని జట్లలో ఈ ఆర్సీబీ ఒకటి. 2013 నుంచీ విరాట్ కోహ్లీ ఆ జట్టు బాధ్యతలు తీసుకున్నా టైటిల్ అందించలేకపోయాడు. మరి డుప్లెసిస్ ఆ జట్టును ఎలా నడిపిస్తాడన్నది ఆసక్తిగా మారింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
Electric vehicles: ఈవీ కంపెనీలకు కేంద్రం షోకాజ్ నోటీసులు.. నెలాఖరు డెడ్‌లైన్!
-
India News
Spicejet: స్పైస్‌జెట్ విమానంలో సాంకేతికలోపం.. కరాచీలో అత్యవసర ల్యాండింగ్
-
Crime News
Hyderabad: దోషం ఉంది.. శాంతి చేయాలని ₹37 లక్షలు స్వాహా
-
Technology News
HTC Smartphone: హెచ్‌టీసీ నుంచి తొలి మెటావర్స్ ఫోన్
-
Sports News
IND vs ENG : కనీసం రెండు సెషన్లు ఆడలేకపోయారా..? భారత ప్రదర్శనపై రవిశాస్త్రి తీవ్ర అసంతృప్తి
-
Politics News
T Congress: విష్ణువర్ధన్‌రెడ్డి ఇంట్లో లంచ్.. వస్తామని ముఖం చాటేసిన కాంగ్రెస్ సీనియర్లు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- Double BedRooms: అమ్మకానికి.. రెండు పడక గదుల ఇళ్లు!
- China’s real estate crisis: పుచ్చకాయలకు ఇళ్లు.. సంక్షోభంలో చైనా రియల్ ఎస్టేట్ ..!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
- IND vs ENG : టెస్టు క్రికెట్ చరిత్రలో టాప్-4 భారీ లక్ష్య ఛేదనలు ఇవే..!