DC vs PBKS: ఈ పంజాబ్ క్రికెటర్ ఆటతీరు నన్ను ఆకట్టుకుంది.: సునీల్‌ గావస్కర్‌

ప్రస్తుతం పది పాయింట్లతో ఉన్న పంజాబ్‌ కింగ్స్‌ (PBKS) ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే దిల్లీపైనా.. మిగతా రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించాలి. అప్పుడు కూడానూ ఇతర జట్ల ఫలితాలపై ప్లేఆఫ్స్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి.

Published : 13 May 2023 20:37 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆరంభంలో దూకుడుగా ఆడిన పంజాబ్‌ కింగ్స్‌ (PBKS).. టోర్నీ జరిగే కొద్దీ డీలాపడుతూ వచ్చింది. గత రెండు మ్యాచుల్లోనూ ఓడి ప్లేఆఫ్స్‌ అవకాశాలను క్లిష్టతరంగా చేసుకుంది. కీలక సమయంలో దిల్లీతో తలపడేందుకు పంజాబ్ (DC vs PBKS) సిద్ధమవుతోంది. ఈ క్రమంలో పంజాబ్ యువ ఆటగాడు జితేశ్ శర్మ ఆటతీరును టీమ్‌ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌ ప్రశంసించాడు. పంజాబ్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతాడని పేర్కొన్నాడు. 

‘‘పంజాబ్ కింగ్స్‌ జట్టులో జితేశ్ శర్మ సహకారం అద్భుతం. మంచి స్ట్రైక్‌రేట్‌తో పరుగులు రాబడుతున్నాడు. చివరి నాలుగైదు ఓవర్లలో పంజాబ్‌కు మంచి స్కోరు అందించడంలో జితేశ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. గత కొన్ని సీజన్లలో పంజాబ్‌ జట్టుకు లోటుగా అనింపించిన అంశమదే. బ్యాటింగ్‌లో అతడి ప్రదర్శనను తక్కువగా లెక్కకట్టలేం’’ అని గావస్కర్‌ తెలిపాడు. జితేశ్ శర్మ 11 మ్యాచుల్లో 165.97 స్ట్రైక్‌రేట్‌తో 239 పరుగులు సాధించాడు.

ప్రస్తుతం పంజాబ్ కింగ్స్‌ 11 మ్యాచుల్లో ఐదు విజయాలు, ఆరు ఓటములతో  పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. పంజాబ్ ఖాతాలో 10 పాయింట్లు ఉన్నాయి. మరోవైపు అట్టడుగున ఉన్న దిల్లీ క్యాపిటల్స్‌ (8 పాయింట్లు)కు ప్లేఆఫ్స్‌కు అవకాశాలు దాదాపు లేకపోయినా.. ఇతర జట్ల ఛాన్స్‌లను దెబ్బతీసే అవకాశం  మాత్రం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు