CSK vs GT: ‘ఫైనల్’ ఓవర్‌లో హార్దిక్ అలా ఎందుకు చేశాడో..?: సునీల్ గావస్కర్
రెండోసారి వరుసగా ఛాంపియన్‌గా నిలుద్దామనే గుజరాత్ (GT) ఆశలకు చెన్నై ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) బ్రేక్ వేశాడు. చివరి రెండు బంతులను సిక్స్, ఫోర్‌గా మలిచి సీఎస్‌కేను (CSK) విజేతగా నిలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి విజేతగా నిలిచి ముంబయితో సమంగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను చివరి బంతికి చిత్తు చేసి టైటిల్‌ను సీఎస్‌కే ఎగరేసుకుపోయింది. సీఎస్‌కే ఛేదన సమయంలో 19.4 ఓవర్ల వరకు గుజరాత్ టైటాన్స్ పైచేయి సాధించింది. వరుసగా రెండోసారి విజేతగా నిలుద్దామని భావించిన తరుణంలో.. చివరి రెండు బంతులను సిక్స్, ఫోర్‌గా మలిచి రవీంద్ర జడేజా సీఎస్‌కేను ఛాంపియన్‌గా నిలిపాడు. ఈ క్రమంలో ఆఖరి ఓవర్‌ను వేసిన మోహిత్ శర్మ నాలుగు బంతుల్లో కేవలం మూడు పరుగులే ఇచ్చాడు. అలాంటి సమయంలో మోహిత్ బౌలింగ్ రిథమ్‌ను దెబ్బ తీసేలా కెప్టెన్ హార్దిక్ పాండ్య బ్రేక్ తీసుకోవడంపై క్రికెట్ మాజీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా సునీల్ గావస్కర్ గుజరాత్ కెప్టెన్ నిర్ణయంపై చురకలు అంటించాడు.
‘‘మోహిత శర్మ చాలా అనుభవం ఉన్న బౌలర్. చివరి ఓవర్‌లో నాలుగు బంతులను అద్భుతంగా వేశాడు. కారణం ఏంటో తెలియదు.. ఓవర్ మధ్యలో మంచినీటిని తాగుతూ కనిపించాడు. అప్పుడే హార్దిక్ పాండ్య వచ్చి మాట్లాడాడు. ఓ బౌలర్ మంచి రిథమ్‌తో బౌలింగ్ చేస్తున్నప్పుడు అతడికి ఎలాంటి సూచనలు ఇవ్వకూడదు. కాస్త దూరంగా ఉండి ‘బాగా బౌలింగ్ చేశావు’ అని మాత్రమే అనాలి. వారి దగ్గరికి వెళ్లి మాట్లాడటం, ఏదొకటి చెప్పడం సరైంది కాదు. అలాంటప్పుడు బౌలర్ అయోమయం చెందే ప్రమాదం లేకపోలేదు. ఇప్పుడు కూడా అదే జరిగింది. తర్వాతి రెండు బంతులకు మోహిత్ పరుగులు ఇచ్చేశాడు’’ అని సునీల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు.
సీఎస్‌కేతో ఫైనల్ మ్యాచ్‌లో మోహిత్ శర్మ అజింక్య రహానె, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ వికెట్లను పడగొట్టాడు. అప్పటిదాకా మంచి లయతో బౌలింగ్ వేసిన మోహిత్.. చివరి రెండు బంతులను సరైన లెంగ్త్‌లో సంధించలేక విఫలమై తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాడు. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో 27 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో రెండో స్థానంలో నిలిచిన గుజరాత్ బౌలర్ కావడం విశేషం. మహమ్మద్ షమీ 28 వికెట్లతో పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Rahul Gandhi: విద్వేష మార్కెట్లో ప్రేమ దుకాణం.. బీఎస్పీ ఎంపీని కలిసిన రాహుల్
-
Team India: భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్..
-
Guntur: వైకాపా దాడి చేస్తే.. తెదేపా దీక్షా శిబిరాన్ని తొలగించిన పోలీసులు
-
Vijay Deverakonda: ఆ బ్రాండ్‌కు విజయ్ దేవరకొండ బై.. ఈసారి అంతకుమించి!
-
IND vs AUS: ఆసీస్‌పై భారత్ విజయం.. మూడు వన్డేల సిరీస్‌లో ఆధిక్యం