T20 World Cup: హార్దిక్‌, భువీని తప్పించి వాళ్లని తీసుకోవాలి: సునీల్ గవాస్కర్‌

టీ20 ప్రపంచకప్‌ సూపర్ 12లో భాగంగా అక్టోబర్‌ 31న భారత్‌, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలనే కసితో ఉంది. కీలకమైన ఈ పోరుకు భారత జట్టు

Updated : 16 Nov 2021 15:30 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌ సూపర్ 12లో భాగంగా అక్టోబర్‌ 31న భారత్‌, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలనే కసితో ఉంది. కీలకమైన ఈ పోరుకు భారత జట్టు రెండు మార్పులను చేయాలని భారత మాజీ ఆటగాడు సునీల్‌ గావాస్కర్ సూచించారు. హార్దిక్‌ పాండ్య స్థానంలో ఇషాన్‌ కిషన్‌ని, భువనేశ్వర్‌ కుమార్‌ స్థానంలో శార్దూల్‌ ఠాకూర్‌ని జట్టులోకి తీసుకోవాలని సలహా ఇచ్చారు.

‘పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య భుజానికి గాయమైంది. దీంతో అతడు బౌలింగ్‌ చేయకపోతే.. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఇషాన్‌ కిషన్‌ని హార్దిక్ స్థానంలో తీసుకోవాలని సూచిస్తా. భువనేశ్వర్‌ కుమార్‌ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ పేరుని పరిశీలించవచ్చు. అలాగానీ, భారీ మార్పులు చేస్తే భారత జట్టు మ్యాచ్‌ గురించి భయపడుతోందని న్యూజిలాండ్‌ భావిస్తుంది’ అని గావస్కర్ అన్నారు. 

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య 8 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చాడు. ఇక, భువీ విషయానికొస్తే..  మూడు ఓవర్లు బౌలింగ్‌ చేసి ఒక వికెట్‌ కూడా పడగొట్టకుండా 25 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో పాక్‌పై భారత్ 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని