Sunil Gavaskar: భువి తప్ప వికెట్లు తీసే బౌలర్లు లేరు: గావస్కర్

దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదు టీ20ల సిరీస్‌లో టీమ్‌ఇండియా జట్టులో వికెట్లు తీసే బౌలర్లు లేరని మాజీ సారథి సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. కటక్‌ వేదికగా గతరాత్రి జరిగిన రెండో టీ20లోనూ...

Updated : 13 Jun 2022 10:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదు టీ20ల సిరీస్‌లో టీమ్‌ఇండియా జట్టులో వికెట్లు తీసే బౌలర్లు లేరని మాజీ సారథి సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. కటక్‌ వేదికగా గతరాత్రి జరిగిన రెండో టీ20లోనూ భారత జట్టు ఓటమిపాలవ్వడంపై బ్యాటింగ్‌ దిగ్గజం స్పందించారు. ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు.

‘ఈ టీమ్‌ఇండియా జట్టులో భువనేశ్వర్‌ కుమార్ తప్పితే మరో వికెట్‌ టేకింగ్‌ బౌలర్‌ లేడు. అదే ఈ సిరీస్‌లో అతిపెద్ద సమస్య. వికెట్లు తీస్తేనే ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టొచ్చు. అందుకే తొలి టీ20లో 211 పరుగుల భారీ స్కోర్‌ సాధించినా లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయారు’ అని గావస్కర్‌ పేర్కొన్నాడు.

కాగా చాలా నెమ్మదిగా ఉన్న కటక్‌ పిచ్‌పై తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 148/6 స్కోర్‌ సాధించింది. ఇషాన్‌ కిషన్‌ (34), శ్రేయస్‌ అయ్యర్‌ (40), దినేశ్‌ కార్తీక్‌ (30) ఆ మాత్రం పరుగులు చేయడంతో.. భారత్‌ మోస్తరు స్కోర్‌ చేసింది. ఈ క్రమంలోనే ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 18.2 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. డికాక్‌ స్థానంలో ఈ మ్యాచ్‌లో ఆడిన క్లాసెన్‌ (81; 46 బంతుల్లో 7x4, 5x6) చెలరేగడంతో ఆ జట్టు సునాయాస విజయం సాధించింది. దీంతో దక్షిణాఫ్రికా ఈ సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో భువి 13 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని