Sunil Gavaskar: ఉమ్రాన్ వైడ్లు వేయకపోతే.. అతడిని ఎదుర్కోవడం చాలా కష్టం: గావస్కర్‌

హైదరాబాద్‌ సెన్సేషనల్‌ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ వైడ్లు వేయకుండా వికెట్‌ టు వికెట్‌ బంతిని సంధిస్తే.. అతడిని ఎదుర్కోవడం చాలా కష్టమని టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు...

Published : 20 Apr 2022 01:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హైదరాబాద్‌ సెన్సేషనల్‌ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ వైడ్లు వేయకుండా వికెట్‌ టు వికెట్‌ బంతిని సంధిస్తే.. అతడిని ఎదుర్కోవడం చాలా కష్టమని టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. ఆదివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉమ్రాన్‌ మొత్తం నాలుగు వికెట్లు తీయడంతో పాటు 150 కి.మీ వేగానికి పైగా బంతులు విసరడంతో అందరి ప్రశంసలూ పొందుతున్నాడు.ఈ నేపథ్యంలోనే గావస్కర్‌ ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ ఇలా పేర్కొన్నాడు.

‘ఉమ్రాన్‌ బౌలింగ్‌లో లెగ్‌సైడ్‌ వైడ్లు వేయకుండా నియంత్రించుకుంటే అతిగొప్ప బౌలర్‌గా ఎదుగుతాడు. అలా చేయడం ద్వారా బంతిని నేరుగా వికెట్లకే సంధిస్తాడు. అలాగే అతడికి లభించే పేస్‌తో బంతిని ఎదుర్కోవడం ఏ బ్యాట్స్‌మెన్‌కైనా అంత తేలిక కాదు. వికెట్‌ టు వికెట్‌ బౌలింగ్‌ చేయడం ద్వారా ఇతరులు ఎదుర్కోలేని విధంగా తయారవుతాడు. తర్వాత టీమ్‌ఇండియాకు ఎంపికవుతాడు’ అని గావస్కర్‌ వివరించాడు. కాగా, ఈ విజయంతో హైదరాబాద్‌ ప్రస్తుతం ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఉమ్రాన్‌ అందరికన్నా ఎక్కువ వేగంతో బంతులు విసురుతూ బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని