IND vs AUS: ఆ ప్రశ్నకు సమాధానం.. వచ్చే ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లోనైనా చెప్పాలి: గావస్కర్‌

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ ఓటమికి ప్రధాన కారణం.. బౌలింగ్‌ వైఫల్యం. భువనేశ్వర్, హర్షల్‌, ఉమేశ్‌ యాదవ్‌ వంటి తేలిపోయారు. ఈ క్రమంలో...

Published : 23 Sep 2022 02:28 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ ఓటమికి ప్రధాన కారణం.. బౌలింగ్‌ వైఫల్యం. భువనేశ్వర్, హర్షల్‌, ఉమేశ్‌ యాదవ్‌ వంటి మేటి బౌలర్లు తేలిపోయారు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌పై క్రికెట్‌ దిగ్గజం సునీల్ గావస్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా పలు కీలక ప్రశ్నలు సంధించాడు. టీ20 ప్రపంచకప్‌ కోసం స్టాండ్‌బై ప్లేయర్‌గా ఎంపిక చేసిన దీపక్‌ చాహర్‌ను కాదని ఉమేశ్‌ యాదవ్‌ను ఎందుకు ఆడించారో చెప్పాల్సిన బాధ్యత మేనేజ్‌మెంట్‌పై ఉందని గావస్కర్‌ పేర్కొన్నాడు. మెగా టోర్నీలో భాగమయ్యే ఆటగాళ్లను కాదని ఇతర ప్లేయర్లకు అవకాశం ఇవ్వడం సరైందకాదని అభిప్రాయపడ్డాడు. 

‘‘ప్రపంచకప్‌లో ఉమేశ్‌ యాదవ్‌ను ప్రధాన జట్టులోకి గానీ.. స్టాండ్‌బై ప్లేయర్‌గానీ తీసుకోలేదు. అలాంటి సందర్భంలో ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు ఎందుకు అవకాశం కల్పించారు? భారత జట్టు మేనేజ్‌మెంట్‌ కచ్చితంగా చెప్పాల్సిన ప్రశ్న అని నేను అనుకుంటున్నా. షమీ కరోనా బారిన పడటంతో ఉమేశ్‌ను తీసుకొచ్చారు. అతడు బౌలింగ్‌లో లయను అందుకోవడంలో విఫలమయ్యాడు. అందుకే తర్వాతి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లోనైనా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. చాహర్‌ విషయంపై స్పష్టత ఇస్తే కానీ.. మనం ఏదీ మాట్లాడలేం’’ అని గావస్కర్‌ అన్నారు. శుక్రవారం భారత్‌-ఆసీస్‌ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే భారత్‌ సిరీస్‌ రేసులో నిలుస్తుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని