తండ్రైన ఆనందంలో మరో స్టార్‌ క్రికెటర్‌

వెస్టిండీస్ స్పిన్నర్‌ సునిల్‌ నరైన్‌ తొలిసారిగా తండ్రయ్యాడు. ఈ విషయాన్న ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపాడు. తన కుమారుడి ఫొటోని అభిమానులతో పంచుకున్నాడు. ‘‘మాకు తెలియని అనుభూతిని...

Published : 03 Feb 2021 02:33 IST

ఇంటర్నెట్‌డెస్క్: వెస్టిండీస్ స్పిన్నర్‌ సునిల్‌ నరైన్‌ తొలిసారిగా తండ్రయ్యాడు. ఈ విషయాన్న ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపాడు. తన కుమారుడి ఫొటోని అభిమానులతో పంచుకున్నాడు. ‘‘మాకు తెలియని అనుభూతిని అందించావు. దేవుడి మంచితనం, దయ ఈ చిన్ని ముఖంలో కనిపిస్తోంది. నిన్ను అమితంగా ప్రేమిస్తాం - అమ్మానాన్న’’ అని దానికి వ్యాఖ్య జతచేశాడు.

విండీస్‌ క్రికెటర్‌ అయినప్పటికీ భారత్‌లోనూ నరైన్‌కు అభిమానులు ఉన్నారు. ఐపీఎల్‌లో అతడు కోల్‌కతా నైట్ రైడర్స్‌ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తన స్పిన్‌తో పాటు ఓపెనర్‌గా బౌండరీలు బాదుతూ నరైన్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే అతడు ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న టీ10 లీగ్‌లో డెక్కన్ గ్లాడియేటర్స్‌ తరఫున ఆడుతున్నాడు. ఇటీవల స్టార్‌ ప్లేయర్స్‌ విరాట్ కోహ్లీ, కేన్‌ విలియమ్సన్‌ కూడా తండ్రైన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి

టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరిన కివీస్‌

అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు: రాహుల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని