Updated : 25 Sep 2021 21:30 IST

SRH vs PBKS: పంజాబ్‌ బ్యాట్స్‌మెన్‌ టపటపా.. సన్‌రైజర్స్‌ ముందు స్వల్ప లక్ష్యం

ఇంటర్నెట్‌ డెస్క్‌: షార్జా వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ బౌలర్లు రెచ్చిపోయారు. జేసన్‌ హోల్డర్‌ 3/19, రషీద్‌ఖాన్‌ 1/17, సందీప్‌ శర్మ 1/20 కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు మాత్రమే చేసింది. పంజాబ్‌ బ్యాట్స్‌మెన్లలో మార్‌క్రమ్‌ (27) ఒక్కడే టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

టాస్‌ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ తొలుత నిలకడగానే ఆడింది. నాలుగు ఓవర్లకు 26/0తో కాస్త మెరుగైన స్థితిలో ఉన్న ఆ జట్టుకు జేసన్‌ హోల్డర్‌ ఐదో ఓవర్‌లో గట్టి షాక్‌ ఇచ్చాడు. కెప్టెన్‌ కేఎల్ రాహుల్ ‌(21; 21 బంతుల్లో 3×4), మయాంక్‌ అగర్వాల్ (5)లను ఔట్‌ చేశాడు. రాహుల్‌.. సుచిత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌ చేరగా.. మయాంక్‌ విలియమ్సన్‌కి చిక్కాడు. వీరిద్దరూ ఔటైన తర్వాత స్కోరు వేగం నెమ్మదించింది. క్రిస్‌ గేల్ (14; 17 బంతుల్లో 1×4) బ్యాట్‌ ఝళిపించలేదు. రషీద్‌ ఖాన్‌ వేసిన 11వ ఓవర్‌లో గేల్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన నికోలస్‌ పూరన్‌(8), దీపక్‌ హుడా (13) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. పూరన్‌ని సందీప్‌ శర్మ పెవిలియన్‌ చేర్చగా.. హోల్డర్‌ వేసిన 16వ ఓవర్లో హుడా ఔటయ్యాడు. సమద్‌ వేసిన 15వ ఓవర్‌లో మార్‌క్రమ్.. మనీశ్ పాండేకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. నాథన్‌ ఎలిస్‌ (12) భువనేశ్వర్ కుమార్‌ వేసిన ఓవర్లో పెవిలియన్‌ చేరాడు. హర్‌ప్రీత్‌ బ్రర్‌ (18) నాటౌట్‌గా నిలిచాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని