supreme court: అతన్ని పారాలింపిక్స్‌కు పంపండి

టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొనే భారత షూటర్ల బృందంలో నరేష్‌కుమార్‌ శర్మాను తీసుకోవాలని సుప్రీం కోర్టు సోమవారం భారత పారాలింపిక్స్‌ కమిటీ(పీసీఐ)కి ఆదేశించింది.

Published : 02 Aug 2021 18:51 IST

పీసీఐకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం

దిల్లీ: టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొనే భారత షూటర్ల బృందంలో నరేష్‌కుమార్‌ శర్మను తీసుకోవాలని సుప్రీంకోర్టు సోమవారం భారత పారాలింపిక్స్‌ కమిటీ(పీసీఐ)కి ఆదేశించింది.  పేర్ల ఎంపికకు సోమవారమే చివరి రోజు కావడంతో.. సదరు క్రీడాకారుడి అభ్యర్థన మేరకు జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్‌, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కృష్ణమురారితో కూడిన బెంచ్‌ అత్యవసర విచారణ చేపట్టింది. మరోవైపు ఈ విషయంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని క్రీడామంత్రిత్వశాఖ పేర్కొంది. పతకాల సంఖ్య పెరిగితే సంతోషమేనని వ్యాఖ్యానించింది. ఈ నెల 24 నుంచి సెప్టెంబరు 5 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి. శర్మ సైతం ఐదు సార్లు పారాలింపిక్స్‌లో పాల్గొనడం గమనార్హం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని