Archery World Cup: ఆర్చరీ ప్రపంచకప్‌ ఫైనల్లో సురేఖ బృందం

తెలుగమ్మాయి జ్యోతి సురేఖ, అదితి స్వామి, ప్రణీత్‌ కౌర్‌లతో కూడిన భారత కాంపౌండ్‌ జట్టు ఆర్చరీ ప్రపంచకప్‌ (స్టేజ్‌-3)లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో భారత త్రయం 234-227తో తుర్కియే జట్టుపై విజయం సాధించింది.

Published : 20 Jun 2024 02:34 IST

అంటాల్య: తెలుగమ్మాయి జ్యోతి సురేఖ, అదితి స్వామి, ప్రణీత్‌ కౌర్‌లతో కూడిన భారత కాంపౌండ్‌ జట్టు ఆర్చరీ ప్రపంచకప్‌ (స్టేజ్‌-3)లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో భారత త్రయం 234-227తో తుర్కియే జట్టుపై విజయం సాధించింది. శనివారం జరిగే ఫైనల్లో ఎస్తోనియా జట్టుతో తలపడుతుంది. జ్యోతి బృందం ఏప్రిల్, మేలో షాంఘై, ఇంచియాన్‌లో జరిగిన ప్రపంచకప్‌లలో స్వర్ణాలు గెలుచుకుంది. మరోవైపు పురుషుల విభాగంలో భారత జట్టుకు నిరాశ తప్పలేదు. కేవలం ఒక్క పాయింటు తేడాతో కాంస్యం చేజార్చుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ప్రియాంశ్, అభిషేక్‌ వర్మ, ప్రథమేశ్‌ త్రయం 235-236 తేడాతో  ఫ్రాన్స్‌ (నికోలస్‌ గిరార్డ్, జీన్‌ ఫిలిప్, అడ్రియన్‌ గోంటియర్‌) చేతిలో పరాజయంపాలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని