Suresh Raina: ప్రపంచకప్‌లో అతడు మరో ధోనీలా ఆడతాడు: సురేశ్‌ రైనా

ప్రపంచకప్‌లో ఎవరెలా రాణిస్తారనే అంశంపై సురేశ్‌ రైనా జోస్యం చెప్పాడు.  జట్టులో గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ హార్దిక్‌ పాండ్యా  మాత్రం మరో ధోనీలా చెలరేగుతాడని తెలిపాడు.

Updated : 15 Oct 2022 18:14 IST

దిల్లీ: ఇప్పుడు ఎవరి నోట విన్నా ప్రపంచకప్‌ మాటే. ఆసీస్‌ వేదికగా అక్టోబర్‌ 23న ప్రారంభం కానున్న ఈ సిరీస్‌ కోసం అన్ని దేశాల జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ కీలక టోర్నీలో రోహిత్‌ శర్మ సారథ్యంలోని టీమ్‌ఇండియాలో.. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా పలు కారణాల రీత్యా తాత్కాలికంగా వైదొలగడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎవరెలా రాణిస్తారనే అంశంపై సురేశ్‌ రైనా జోస్యం చెప్పాడు.  జట్టులో గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ హార్దిక్‌ పాండ్యా  మాత్రం మరో ధోనీలా చెలరేగుతాడని తెలిపాడు. 

‘‘సూర్యకుమార్‌ బ్యాటింగ్‌ సామర్థ్యం రెండేళ్లుగా చూస్తున్నాం. అతడు ఈ టోర్నీలో సైతం అంతే గొప్పగా ఆడాలని కోరుకుంటున్నా. అయితే ఇక్కడ మరో ‘డార్క్‌హార్స్‌’ గురించి చెప్పుకోవాలి. అతడి యాంగిల్, స్వింగ్‌ అద్భుతంగా ఉంటాయి. నా ఎంపిక హార్దిక్‌ పాండ్యానే. అతడు గేమ్‌ను నియంత్రిస్తాడు. కీలక ఓవర్లలో తన బౌలింగ్‌తో ఆకట్టుకుంటాడు. అచ్చం ధోనీలా ఆటను ముగిస్తాడు. వీరు జట్టులో కీలక పాత్ర పోషిస్తారు. సూర్య  గేమ్‌ఛేంజర్‌గా నిలుస్తాడు. అలాగని అర్ష్‌దీప్‌ సింగ్‌, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ ఆటను మరువలేం. పాకిస్థాన్‌తో ఆడే తొలి మ్యాచ్‌ను ఎలాగైనా బాగా ఆడాలి. అది మున్ముందు పరిస్థితులను సజావుగా సాగేలా చేస్తుంది. టీ20ల్లో ఇదెంతో అవసరం’’ అని రైనా తెలిపాడు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని