suresh raina: ఒక్క క్యాచ్‌తో గోల్డెన్‌ డేస్‌ గుర్తుచేసిన రైనా.. వీడియో వైరల్‌

టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ సురేశ్‌ రైనా జోరు ఏమాత్రం తగ్గలేదు.

Published : 29 Sep 2022 17:01 IST

రాయ్‌పుర్‌: టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ సురేశ్‌ రైనా జోరు ఏమాత్రం తగ్గలేదు. అన్ని ఫార్మాట్లలో ఆటకు రిటైర్మెంట్‌ పలికిన ఈ విధ్వంసక ఆటగాడు ఇండియా లెజెండ్స్‌తో ఆస్ట్రేలియా లెజెండ్స్‌కి మధ్య జరిగిన రోడ్‌ సేఫ్టీ ప్రపంచ సిరీస్‌ 2022  లో మెరుపులు మెరిపించాడు. బుధవారం సాయంత్రం రాయ్‌పుర్‌లోని నారాయణ్‌ సింగ్‌ మైదానంలో జరిగిన తొలి సెమీ ఫైనల్‌ మ్యాచులో రైనా తన ఫీల్డింగ్‌ మాయాజాలాన్ని చూపాడు. 

16వ ఓవర్లో ఆస్ట్రేలియా ఆటగాడు బెన్‌ డంక్‌ తన బ్యాటింగ్‌తో చెలరేగుతూ బౌండరీ కొట్టే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఫీల్డింగ్‌లో ఉన్న రైనా రెప్పపాటులో గాల్లోకి ఎగిరి బంతిని క్యాచ్‌ పట్టుకున్నాడు.  ఆ ఒక్క క్యాచ్‌తో స్టేడియం మొత్తం హోరెత్తింది. కెప్టెన్‌ సచిన్‌ తెందూల్కర్‌ సహా సహచర ఆటగాళ్లు రైనాను అభినందిస్తున్న ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గతంలో ఇదే తరహా క్యాచులతో ఆకట్టుకున్న వీడియోలను దీనికి జత చేసి అభిమానులు ట్రెండ్‌ చేస్తున్నారు. 2005లో క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఈ ఆటగాడు చెన్నై జట్టులో ధోనీ తర్వాత ఆ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకడిగా పేరుపొందాడు. 204 మ్యాచుల్లో 5,528 పరుగులు చేసి అగ్రస్థానాన్ని అందుకున్నాడు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని