Believe: మే 24న రైనా ఆత్మకథ

రైనా అభిమానులకు శుభవార్త! ఈ టీమ్‌ఇండియా క్రికెటర్‌ జీవితం త్వరలోనే పుస్తక రూపంలో రానుంది....

Published : 13 May 2021 20:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రైనా అభిమానులకు శుభవార్త! ఈ టీమ్‌ఇండియా క్రికెటర్‌ జీవితం త్వరలోనే పుస్తక రూపంలో రానుంది. ‘బిలీవ్‌: వాట్‌ లైఫ్‌ అండ్‌ క్రికెట్‌ టాట్‌ మి’ (నమ్మకం: జీవితం, క్రికెట్‌ నాకేం బోధించిందంటే) పుస్తకం మే 24న విడుదల కానుంది. రైనాతో పాటు రచయిత, పాత్రికేయుడు భరత్‌ సుందరేశన్‌ ఈ పుస్తకాన్ని రాశారు. పెంగ్విన్‌ ర్యాండమ్‌ హౌజ్‌ ఇండియా ప్రచురించింది.

యువ క్రికెటర్‌గా ఉన్నప్పుడు సురేశ్ రైనా ఎదుర్కొన్న సవాళ్లు, పాఠశాల, క్రికెట్‌ శిబిరాల్లో ఎదుర్కొన్న అవమానాలు, ఏళ్ల తరబడి కొనసాగుతున్న అనుబంధాల గురించి ఈ పుస్తకంలో వివరించారు. ‘బిలీవ్‌.. క్రికెట్‌ కలలను నిజం చేసుకొనేందుకు సాగించిన అంతర్గత ప్రయాణం. బిలీవ్‌.. నీలో అత్యుత్తమ గుణాలను ఆవిష్కరించేందుకు అవసరమైంది. బిలీవ్‌.. సరిహద్దులను దాటేసి నీపై నీకు విశ్వాసం ఉంటే..’ అని రైనా తన పుస్తకం గురించి సోషల్‌ మీడియాలో పెట్టాడు.

సీనియర్‌ క్రికెటర్లైన రాహుల్‌ ద్రవిడ్‌, ఎంఎస్‌ ధోనీ, సౌరవ్‌ గంగూలీ, సచిన్‌ తెందూల్కర్‌ నుంచి మైదానం, మైదానం ఆవల నేర్చుకున్న పాఠాలను రైనా ఈ పుస్తకంలో వివరించాడని తెలిసింది. కాగా, ఎంఎస్‌ ధోనీతో వీడ్కోలు పలికిన రైనా ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ ఆడాడు. గతేడాది వ్యక్తిగత కారణాలతో దూరమైన అతడు తిరిగి చేరాక ఆ జట్టు బలం మరింత పెరిగింది. చక్కని విజయాలు సాధించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని