SKY:అందుకే టాటూలు వేయించుకుంటా.. నా ఫస్ట్ టాటూ అదే: సూర్యకుమార్‌ యాదవ్‌

స్టార్‌ క్రికెటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav)కు టాటూలు (tattoos) అంటే ఎంతో ఇష్టమని మనందరికీ తెలుసు. అసలు టాటూలు వేయించుకోవాలని ఎందుకనిపించింది? తాను వేయించుకున్న తొలి టాటూ ఏంటనే విషయాన్ని సూర్య తాజాగా వెల్లడించాడు. 

Published : 09 May 2023 19:45 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా, ముంబయి ఇండియన్స్‌ స్టార్‌ క్రికెటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav)కు టాటూలు (tattoos) అంటే ఎంతో ఇష్టమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడి శరీరం, చేతిపై ఉన్న టాటూలే అందుకు నిదర్శనం. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్న సూర్యకుమార్‌ యాదవ్‌ తాజాగా జియో సినిమాతో మాట్లాడాడు. అసలు టాటూలు వేయించుకోవాలని ఎందుకనిపించింది? తాను వేయించుకున్న తొలి టాటూ ఏంటో వెల్లడించాడు సూర్య. 

‘‘తొలిసారి నేను నా ముంజేతిపై టాటూ వేయించుకున్నాను. అది చూడ్డానికి చాలా బాగా కనిపించింది. అక్కడి నుంచి నా శరీరంపై చాలా టాటూలు వేయించుకోవాలనుకున్నాను. నేను మొదటిసారి న్యూజిలాండ్‌ వెళ్లినపుడు అక్కడివాళ్లు టాటూలు వేసుకోవడం చూశాను. అప్పుడు నేను మా అమ్మానాన్నల అనుమతి తీసుకొని టాటూ వేయించుకోవాల్సి వచ్చింది. అయితే, వాళ్ల పేరునే తొలి టాటూగా వేయించుకున్నాను. ఆ తర్వాత ఇక టాటూలు వేయించుకునే ప్రక్రియ ఆగలేదు. తర్వాత నాకు పెళ్లైంది. మరొకరి (భార్య) అనుమతి కూడా తీసుకోవాల్సి వచ్చింది.  నా వైఫ్‌ పేరును ఛాతిపై టాటూగా రాయించుకున్నాను. మళ్లీ  అనుమతి లభించింది.  ఇక ఆ తర్వాత టాటూలు వేయించుకుంటూ వెళ్లాను. ఇప్పుడు నా శరీరంపై ఖాళీ ఎక్కడ ఉందా అని చూస్తున్నాను’’ అని సూర్యకుమార్‌ అన్నాడు.  

‘‘చివరకు మొహం, నుదురు, మెడపై కూడా టాటూలు వేయించుకో అని నా భార్య సరదాగా అంటూ ఉంటుంది. అయితే, ముఖంపై మాత్రం టాటూలు వేయించుకోలేం కదా? అయితే, కొంత మంది ముఖంపై, కళ్ల కింద వేయించుకోవడం కూడా చూశాను. అలాంటి వాళ్లకు టాటూలు అంటే పిచ్చి’’ అని సూర్య పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని