T20: సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌కు చోటు

ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు మ్యాచుల టీ20 సిరీసుకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. 19 మందితో కూడిన బృందంలో యువ ఆటగాళ్లు ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రాహుల్‌ తెవాతియా చోటు దక్కించుకున్నారు. మార్చి 12 నుంచి అహ్మదాబాద్‌ వేదికగా పొట్టి క్రికెట్‌ సిరీస్‌ ఆరంభమవుతున్న సంగతి....

Updated : 20 Feb 2021 21:42 IST

కుల్‌దీప్‌, మనీశ్‌ ఔట్‌: తెవాతియా, చక్రవర్తి ఇన్‌

ముంబయి: ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు మ్యాచుల టీ20 సిరీసుకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. 19 మందితో కూడిన బృందంలో యువ ఆటగాళ్లు ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రాహుల్‌ తెవాతియా చోటు దక్కించుకున్నారు. మార్చి 12 నుంచి అహ్మదాబాద్‌ వేదికగా పొట్టి క్రికెట్‌ సిరీస్‌ ఆరంభమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇంగ్లాండ్‌ తమ జట్టును ప్రకటించింది.

దేశవాళీ క్రికెట్లో ముంబయి, ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున నిలకడైన ప్రదర్శనలతో దుమ్మురేపిన సూర్యకుమార్‌ యాదవ్‌కు ఎట్టకేలకు చోటు దక్కింది. అదే ముంబయి ఇండియన్స్‌, ఝార్ఖండ్‌ జట్టుకు విజయాలు అందించిన యువ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌ కిషన్‌ సైతం అరంగేట్రం చేయబోతున్నాడు. సిరీస్‌లో రిషభ్‌పంత్‌తో పాటు అదనపు కీపర్‌గా ఉండబోతున్నాడు. ఐపీఎల్‌లో గతేడాది చిరస్మరణీయ ఇన్నింగ్సులు ఆడిన ఆల్‌రౌండర్‌ తెవాతియానూ అదృష్టం వరించింది. ఇక పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతినివ్వగా కుల్‌దీప్‌ యాదవ్‌, మనీశ్‌ పాండే జట్టులో చోటు కోల్పోయారు.

భారత జట్టు: విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య, రిషభ్‌ పంత్‌, ఇషాన్‌ కిషన్‌, యుజువేంద్ర చాహల్‌, వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్ ‌సుందర్‌, రాహుల్‌ తెవాతియా, టి.నటరాజన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, దీపక్‌ చాహర్‌, నవదీప్‌ సైని, శార్దూల్‌ ఠాకూర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు