SKY: అవును.. సూర్యకుమార్ ‘360 డిగ్రీల ప్లేయర్’: దక్షిణాఫ్రికా బౌలర్ పార్నెల్
టీమ్ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ బ్యాటింగ్‌కు దక్షిణాఫ్రికా బౌలర్ పార్నెల్ ఫిదా అయ్యాడట. మైదానానికి నలువైపులా షాట్లు కొట్టగల సమర్థుడని సూర్యకుమార్‌ను అభినందించాడు. ఇలాంటి బ్యాటర్‌ను ఎదుర్కోవడం బౌలర్లకు కష్టంగా ఉంటుందని పేర్కొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత క్రికెటర్లలో ‘మిస్టర్ 360’ ప్లేయర్ అంటే ఠక్కున వచ్చే పేరు సూర్యకుమార్ యాదవ్.. గత కొంతకాలంగా అందరి నోటా వచ్చే మాట కూడా ఇదే. దక్షిణాఫ్రికా మాజీ స్టార్ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ లాగే మైదానం నలు వైపులా షాట్లు కొట్టడంలో సూర్యకుమార్ దిట్ట. తాజాగా టీమ్ఇండియా సఫారీలతో మూడు టీ20ల సిరీస్‌ను ఆడుతోంది. తొలి టీ20లో కూడా ఇలానే అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. దాంతో దక్షిణాఫ్రికా ఆటగాడు వ్యాన్ పార్నెల్ కూడా సూర్యకుమార్‌ను అభినందించాడు. టీ20ల్లో అత్యంత శక్తివంతమైన బ్యాటర్‌గా సూర్య మారిపోయాడని.. అతడిని ఎదుర్కోవడానికి బౌలర్లు మానసికంగా బలంగా ఉండాలని హెచ్చరించాడు.
‘‘గత కొన్ని నెలలుగా సూర్యకుమార్‌ను పరిశీలించా. ప్రస్తుతం టీ20 బ్యాటర్లలో అత్యుత్తమ ఆటగాడు సూర్యనే. అందులో ఎలాంటి సందేహం లేదు. మైదానానికి నలువైపులా షాట్లు కొట్టగలడు. అతడొక ‘360 డిగ్రీల’ ప్లేయర్. అందుకే అతడిని డిఫెండ్ చేయడం బౌలర్లకు కాస్త కష్టమే. ప్రతి బంతిపైనా దృష్టి పెట్టడం అద్భుతం. మంచి షాట్లు కొట్టేందుకు చూస్తాడు. అలాగే తనదైన రోజున అదృష్టం కూడా కలిసి వస్తుంది. అతడి బ్యాటింగ్‌ను చూసి చాలా ఎంజాయ్ చేశా. నాణ్యమైన క్రికెట్‌ను ఆడుతున్నాడు. తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు చక్కగా బౌలింగ్ చేశారు. మా బ్యాటర్లు ప్రపంచస్థాయి ఆటగాళ్లు. తప్పకుండా పుంజుకొని సిరీస్ బరిలో నిలుస్తాం’’ అని పార్నెల్ వెల్లడించాడు. గువహటి వేదికగా ఆదివారం భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టీ20 రాత్రి ఏడు గంటలకు జరగనుంది. సూర్యకుమార్ యాదవ్ మరో 24 పరుగులు సాధిస్తే అంతర్జాతీయ టీ20ల్లో 1000 పరుగులు సాధించిన తొమ్మిదో భారత బ్యాటర్‌గా అవతరిస్తాడు. ప్రస్తుతం 32 మ్యాచుల్లో 173.3 స్ట్రైక్‌రేట్‌తో 976 పరుగులతో కొనసాగుతున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Suryakumar Yadav: ఐపీఎల్ మ్యాచ్‌లకు సూర్య దూరమేనా? ఇన్‌స్టా పోస్ట్ వైరల్
Suryakumar Yadav: ముంబయి ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ తాజాగా ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అతడు ఐపీఎల్లో ఆడకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
IPL 2023 Rewind: గత సీజన్ ఐపీఎల్ హీరోలు.. లిస్ట్‌లో ఎవరున్నారంటే?
-
IPL: ఐపీఎల్ 2024 సీజన్. కోహ్లీ కొత్త హెయిర్‌స్టైల్ అదుర్స్.. ఫొటోలు వైరల్
ఐపీఎల్ 2024 సీజన్లో విరాట్ కోహ్లీ (Virat Kohli) కొత్త హెయిర్ స్టైల్‌తో బరిలోకి దిగుతున్నాడు. -
Mumbai Indians: హార్దిక్.. అంత వీజీ కాదు
గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్య (Hardik Pandya) తిరిగి ముంబయి ఇండియన్స్‌కు చేరుకుని కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. -
IPL: హామీ ఇస్తున్నా.. అప్పటిలోపు కేకేఆర్‌ను బెటర్ పొజిషన్లో ఉంచుతా: గంభీర్
ఈ సీజన్ నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)కు గౌతమ్ గంభీర్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. తన పదవీకాలం ముగిసే సమయానికి కేకేఆర్‌ని మెరుగైన స్థితిలో ఉంచుతానని గంభీర్ విశ్వాసం వ్యక్తం చేశాడు. -
IPL-SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు షాక్.. మూడు మ్యాచ్‌లకు కీలక ఆటగాడు దూరం
ఐపీఎల్ (IPL) 2024 సీజన్ ఆరంభానికి ముందు సన్‌రైజర్స్‌కు షాక్ తగిలింది. హైదరాబాద్ ఆడే తొలి మూడు మ్యాచ్‌లకు స్పిన్నర్ వానిందు హసరంగ దూరం కానున్నాడు. -
PSL: మ్యాచ్ జరుగుతుండగా డ్రెస్సింగ్ రూమ్‌లో సిగరెట్ తాగిన క్రికెటర్
పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లోని ఇస్లామాబాద్ యునైటెడ్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీమ్ వివాదంలో చిక్కుకున్నాడు. -
IPL 2024: రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య కెప్టెన్సీలో పోలికలు ఇవే: ధ్రువ్ జురెల్
కెప్టెన్సీలో రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య ఉన్న పోలికలను భారత యువ కీపర్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) వివరించాడు. -
POLL: రోహిత్‌ను కాదని హార్దిక్‌కు కెప్టెన్సీ... ముంబయి నిర్ణయం సరైనదేనా?
Mumbai Indians Captiancy: ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య... ఈ మార్పు అభిమానులకు సమ్మతమేనా? -
కొత్త కెప్టెన్.. కోటి ఆశలతో
2013లో ఐపీఎల్ అరంగేట్రం.. 2016లో ఛాంపియన్. స్టార్ ఆటగాళ్లతో ఒకప్పుడు కళకళలాడిన జట్టు. కానీ ఆ తర్వాత తడబాటు. ఒడుదొడుకుల ప్రయాణం. -
నా భుజాలపై రోహిత్ చేతులేసి..
జట్టు కెప్టెన్‌గా రోహిత్ లేనంత మాత్రాన ఏమీ మారదని, తన భుజాలపై చేతులేసి అతను నడిపిస్తాడని ముంబయి ఇండియన్స్ కొత్త సారథి హార్దిక్ పాండ్య అన్నాడు. -
కోహ్లి ముఖంలో ఆనందం చూశా
డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన తర్వాత విరాట్ కోహ్లి ముఖంలో ఆనందం చూశానని కెప్టెన్ స్మృతి మంధాన వెల్లడించింది. -
సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి గెలిపించాడు
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-1తో కైవసం చేసుకుంది. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన తంజిద్ హసన్ (84; 81 బంతుల్లో 9×4, 4×6) మెరుపులు మెరిపించడంతో సోమవారం ఆఖరిదైన మూడో వన్డేలో బంగ్లా 4 వికెట్ల తేడాతో నెగ్గింది. -
ఐపీఎల్ ఆరంభంలో పంత్‌కు కష్టమే
రోడ్డు ప్రమాదంలో గాయపడి 15 నెలల విరామం తర్వాత మైదానంలో అడుగు పెడుతున్న రిషబ్ పంత్‌కు.. ఈ ఐపీఎల్ ఆరంభంలో ఇబ్బందులు తప్పవని దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. -
ప్రపంచ రికార్డుతో అఖిల్‌కు పసిడి
భారత షూటర్ అఖిల్ షెరోన్ అదరగొట్టాడు. ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానం గెలిచిన అతను.. తాజాగా పోలిష్ గ్రాండ్ ప్రి పోటీల్లో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. -
శ్రేయస్ ఫిట్టే కానీ..
కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో ఆడేందుకు ఫిట్నెస్తో ఉన్నట్లుగా బీసీసీఐ నిర్ధరించినట్లు తెలుస్తోంది. -
‘లక్ష్య’ జ్యోతికకు కాంస్యం
ఇండియా ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతిక శ్రీ (ఆంధ్రప్రదేశ్) సత్తాచాటింది. -
బెంగళూరు జట్టుతో విరాట్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐపీఎల్ సన్నాహాలు మొదలుపెట్టాడు. -
కోహ్లీతో బ్యాటింగ్ అంటే..
కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేయడం నమ్మశక్యం కాని అనుభూతి అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు. -
అప్పుడే ఆటను వదిలేద్దామనుకున్నా..
క్రికెట్‌కు 2017లోనే ఆటకు వీడ్కోలు చెబుదామని అనుకున్నట్లు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. -
సర్ఫరాజ్, జురెల్‌లకు బీసీసీఐ కాంట్రాక్టులు
భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, వికెట్‌కీపర్ ధ్రువ్ జురెల్‌కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు లభించాయి. గ్రూప్-సిలో ఉన్న ఈ ఆటగాళ్లు ఫీజు కింద ఏడాదికి కోటి రూపాయలు పొందుతారు.
తాజా వార్తలు (Latest News)
-
YSRCP: ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. వైకాపా ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు
-
Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్’ సరికొత్త రికార్డు.. ఆ విషయంలో తొలి మలయాళ సినిమా
-
Suryakumar Yadav: ఐపీఎల్ మ్యాచ్‌లకు సూర్య దూరమేనా? ఇన్‌స్టా పోస్ట్ వైరల్
-
LS polls: డిపాజిట్ దక్కకున్నా పోటీకి సై.. 71 వేల మంది డిపాజిట్లు ‘గల్లంతు’
-
Hyderabad: ప్రణీత్‌రావుకు సహకరించింది ఎవరు?
-
IPL 2023 Rewind: గత సీజన్ ఐపీఎల్ హీరోలు.. లిస్ట్‌లో ఎవరున్నారంటే?