Suryakumar Yadav: సూర్య @ ప్రపంచ నెం.2

టీ20ల్లో నిలకడగా రాణిస్తూ ర్యాంకింగ్స్‌లో పాక్‌ ఆటగాడు బాబర్‌ ఆజమ్‌ను దాటేశాడు. దీంతో ఐసీసీ టీ20 పురుషుల ప్రపంచ ర్యాంకింగ్స్‌లో బ్యా

Updated : 28 Sep 2022 15:43 IST

* ప్రపంచ టీ20 బ్యాటర్లలో బాబర్‌ను దాటేసిన వైనం

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20ల్లో నిలకడగా రాణిస్తూ ర్యాంకింగ్స్‌లో పాక్‌ ఆటగాడు బాబర్‌ ఆజమ్‌ను సూర్య దాటేశాడు. దీంతో ఐసీసీ టీ20 పురుషుల ప్రపంచ ర్యాంకింగ్స్‌ బ్యాటింగ్‌ విభాగంలో మొత్తం 801 పాయింట్లతో భారత స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ రెండో స్థానం దక్కించుకొన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ చివరి మ్యాచ్‌లో 36 బంతుల్లో 69 పరుగులు చేసి ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. పాక్‌ ఓపెనర్‌ మహమ్మద్‌ రిజ్వాన్‌ 861 పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బాబర్‌ ఆజమ్‌ 799 పాయింట్లు సాధంచి  మూడోస్థానంతో సర్దుకొన్నాడు. రోహిత్‌ శర్మ 613 పాయింట్లతో 13వ స్థానంలో, విరాట్‌ కోహ్లీ ఒక పాయింటు మెరుగుపర్చుకొని 606 పాయింట్లతో 15వ స్థానంలో ఉన్నారు. 

ఇక బౌలింగ్‌ విభాగంలో భారత ఆటగాడు భునేశ్వర్‌ కుమార్‌  658 పాయింట్లతో 10వ స్థానంలో ఉన్నాడు. గతంతో పోలిస్తే ఒక పాయింటు కోల్పోయాడు. ఇక  అక్షర్‌ పటేల్‌ 11 పాయింట్లు మెరుగు పర్చుకొని 588తో 18వ స్థానానికి ఎగబాకాడు. యజువేంద్ర చాహల్‌ 27వ స్థానంలో ఉన్నాడు. టాప్‌-30లో ముగ్గురు మాత్రమే భారత బౌలర్లు ఉన్నారు. ఈ పట్టిక శిఖరంపై 737 పాయింట్లతో జోష్‌ హేజిల్‌వుడ్‌ ఉన్నాడు. 

ఆల్‌రౌండర్‌ విభాగంలో హార్దిక్‌ పాండ్యా ఒక్కడే ఈ జాబితాలో స్థానం సంపాదించుకొన్నాడు. మొత్తం 184 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితా టాప్‌లో 246 పాయింట్లతో బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ మహమ్మద్‌ నబీ కొనసాగుతున్నాడు. ఇక ఈ జాబితాలో  మరే భారత ఆటగాడికి చోటు దక్కలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని